అనుష్కకి ఇంట్లో ఫుల్ ఎంకరేజ్ మెంట్..!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకుంది స్వీటీ అనుష్క.

Update: 2024-12-16 20:30 GMT

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకుంది స్వీటీ అనుష్క. యోగా టీచర్ గా ఉన్న ఆమెను పూరీ తను డైరెక్ట్ చేసిన సూపర్ సినిమాలో కథానాయికగా తీసుకున్నాడు. ఆ సినిమాతోనే ఆమె ప్రేక్షకుల్లో తన మార్క్ వేసుకునేలా చేసింది. ఇక అప్పటి నుంచి యువ హీరోలతో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుని స్టార్ ఛాన్స్ లను అందుకుంది అనుష్క. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎవరు సాహసించని టైం లో అనుష్క ముందుకొచ్చింది. అదే అమ్మడి కెరీర్ ప్రత్యేకంగా నిలిచేలా చేసింది.

అనుష్క చేసిన అరుంధతి సినిమా ఎంత మంచి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఐతే ఆ సినిమాకు ముందు అనుష్క ఎంపిక కాలేదు. కన్నడ స్టార్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ ని కోడి రామకృష్ణ తీసుకోవాలని అనుకోగా ఆమె కాదని చెప్పడంతో అనుష్క ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చింది. అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో చేస్తూ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న అనుష్క అరుంధతితో కంప్లీట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంది.

ఐతే మరోపక్క స్టార్ సినిమాల్లో రెగ్యులర్ పాత్రలు కూడా చేసింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి ఇలాంటి సినిమాలు అనుష్క మాత్రమే చేయగలదు అన్న రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది అనుష్క. అంతేకాదు గ్లామర్ విషయంలో అనుష్క ఎక్కడ తగ్గేది లేదని అంటుంది. బిల్లా సినిమా కోసం అనుష్క మోనోకిని షో చేసింది. ఐతే ఆ సినిమా చూసిన అనుష్క మదర్ ఇంకాస్త స్టైల్ గా ఉండాల్సింది అన్నట్టుగా అన్నారట. మోనోకినికే అమ్మ ఎలా స్పందిస్తారో అనుకున్న అనుష్క ఆమె ఎంకరేజ్ మెంట్ కి షాక్ అయ్యిందని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇంట్లో వాళ్లు పర్వాలేదు అన్నా సరే అనుష్క ఎప్పుడు బోర్డర్ దాటలేదు. స్టార్ సినిమాల్లో అనుష్క ఇంపార్టెన్స్ ఏంటన్నది గుర్తించిన దర్శక నిర్మాతలు చేస్తే అనుష్కనే చేయాలి అని పట్టుబట్టి చేయించిన సినిమాలు ఉన్నాయి. ఐతే ఈమధ్య కెరీర్ పరంగా కాస్త గ్యాప్ ఎక్కువ ఇస్తున్న అమ్మడు ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే అనుష్కకు మళ్లీ మరో సూపర్ హిట్ సినిమాగా ఘాటి నిలిచేలా ఉంది. అనుష్కతో వేదం సినిమా కోసం కలిసి పనిచేసిన క్రిష్ మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా చేస్తున్నాడు. స్వీటీ ఫ్యాన్స్ కి ఈ ఘాటి సూపర్ ట్రీట్ అందించేలా ఉంటుందని తెలుస్తుంది. అనుష్క మరోసారి తన విశ్వరూపం చూపించేందుకు ఘాటితో వస్తుంది.

Tags:    

Similar News