మలయాళంలో మరో అరుంధతి లా అనుష్క ?
అమ్మడు మరోసారి అరుంధది తరహా పాత్రతో ప్రేక్షకుల్ని భయపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అనుష్క శెట్టి టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును దక్కించుకుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ తనదైన మార్క్ వేసింది. ఈ క్రమంలో 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలోనూ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇంతవరకూ ఈ రెండు భాషలు తప్పితే మిగతా భాషల్లో సినిమాలు చేయలేదు
ఈ నేపథ్యంలో అనుష్క మాలీవుడ్ లో ఓ సంచలన చిత్రంతో లాంచ్ అవుతుంది. అమ్మడు మరోసారి అరుంధది తరహా పాత్రతో ప్రేక్షకుల్ని భయపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. 'కథనార్: ది వైల్డ్ సోర్సెరర్' టైటిల్ తో రానున్న ఓ హారర్ సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో జయసూర్య హీరోగా నటిస్తున్నారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ నెటి జనుల్ని ఆకట్టుకుంటుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క అరుంధతి తరహాలో రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. గ్లింప్స్ తోనే ఒణుకు పుట్టించారు. అతీద్రీయ శక్తులు..క్షుద్ర పూజలు..బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ ఆర్ గ్లింప్స్ పై క్యూరియాసిటీని తీసుకొస్తున్నాయి. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని ఏకంగా 14 భాషల్లో రిలీజ్ చేయడం విశేషం. ఆరకంగా అనుష్క కెరీర్ లో ఇదే భారీ విడుదల చిత్రంగా చెప్పొచ్చు. ఇప్పటివరకూ తెలుగు..తమిళ కే పరిమితమైన అమ్మడి క్రేజ్ ఈ సినిమాతో మరింత విస్తరిస్తుంది. అయితే అనుష్క నటించిన తెలుగు సినిమా 'మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి' ప్రచారం లో కనిపించక పోయేసరికి ఆమె ఎక్కడ? అంటూ కొంత నెగిటివ్ ప్రచారం సాగుతోంది. తాజాగా మలయాళం ఎంట్రీ తో అనుష్క ఎక్కడికి వెళ్లిపోలేదని క్లారిటీ దొరికింది.