'దేవ‌ర' అభిమానుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్!

ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ ప్ర‌భుత్వం అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి ప్ర‌క‌టించింది.

Update: 2024-09-21 08:32 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 'దేవ‌ర‌' రిలీజ్ కి కౌంట్ డౌన్ మొద‌లైంది. ఇంకా ఐదు రోజుల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో 'దేవ‌ర' స్పెష‌ల్ షోలు ఉంటాయా? టికెట్ ధ‌ర‌ల పెంపుకు ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుందా? లేదా? ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ ప్ర‌భుత్వం అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి ప్ర‌క‌టించింది.

అలాగే టికెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా జీవో విడుద‌ల చేసింది. తొలిరోజు అర్ద‌రాత్రి 12 గంట‌ల షోతో పాటు ఆరు ఆట‌ల‌కు అనుమ‌తిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆట‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసులు బాటు క‌ల్పించింది. సింగిల్ స్క్రీన్ జీఎస్టీతో క‌లిపి అప్ప‌ర్ క్లాస్ 110 రూపాయ‌లు, లోవ‌ర్ క్లాస్ 60 రూపాయ‌లు, మ‌ల్టిప్లెక్స్ 135 రూపాయ‌ల వ‌ర‌కూ పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, నిర్మాత‌ల్లో ఒక‌రైన క‌ల్యాణ్ రామ్ ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

మ‌రోవైపు తెలంగాణ‌లోనూ స్పెష‌ల్ షోలు, టికెట్ ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వం ఒకే చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. తొలి రోజు అర్ద‌రాత్రి 1 గంట షోకు అనుమ‌తివ్వ‌డంతో పాటు, రోజూ ఆరు ఆట‌ల‌ను 14 రోజుల పాటు ప్ర‌ద‌ర్శించేందుకు అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో 50 రూపాయ‌లు, మ‌ల్టీప్లెక్స్ ల్లో 100 రూపాయ‌లు పెంచుకునేందుకు అనుమ‌తిచ్చిన‌ట్లు ప్ర‌చారం జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Tags:    

Similar News