ఏపీ-తెలంగాణ టాప్ కలెక్షన్స్.. గేమ్ ఛేంజర్ స్థానం ఎక్కడ?
సినిమా టాక్ అనుకున్నంత పాజిటివ్‌గా రాకపోయినా, మొదటి రోజున బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే వసూళ్లు రాబట్టింది.
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ శుక్రవారం రోజు భారీ అంచనాల మధ్య విడుదలైంది. సినిమా టాక్ అనుకున్నంత పాజిటివ్‌గా రాకపోయినా, మొదటి రోజున బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ఓపెనింగ్స్ అందుకొని, టాప్ 10 షేర్ సినిమాల జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకుంది.
గేమ్ ఛేంజర్ ఏపీ తెలంగాణలో 39.52 కోట్ల షేర్‌ను మొదటి రోజునే రాబట్టి, రామ్ చరణ్ క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది. సినిమా టాక్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ, రామ్ చరణ్ ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. టాక్ మరింత పాజిటివ్‌గా ఉండి ఉంటే ఈ నెంబర్లు మరింతగా పెరిగే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
టాలీవుడ్ మార్కెట్ గడచిన కొన్ని సంవత్సరాల్లో భారీ స్థాయిలో అభివృద్ధి చెందింది. బాహుబలి 2 తరువాత, తెలుగు చిత్రాల ఓపెనింగ్స్ మరింత రేంజ్‌కి చేరుకున్నాయి. ఇప్పుడు ప్రతి పెద్ద సినిమా తొలి రోజునే వందల కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొడుతోంది. RRR, పుష్ప 2: ది రూల్, దేవర వంటి సినిమాలు తెలుగు మార్కెట్‌ను విస్తరించడంలో కీలకపాత్ర పోషించాయి.
ఏపీ తెలంగాణలో చూసుకుంటే.. టాప్ 10 డే 1 షేర్ జాబితాలో గేమ్ ఛేంజర్ 7వ స్థానంలో ఉండటం విశేషం. ఈ జాబితాలో ఉన్న ఇతర చిత్రాలు ప్రేక్షకులను ప్రాముఖ్యంగా ఆకట్టుకోగలిగాయి. అయితే, రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్ ఇంకా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
మొదటి రోజు అత్యధిక షేర్ సాధించిన తెలుగు సినిమాల జాబితా ఈ విధంగా ఉంది
1. RRR: 74.11 కోట్లు
2. పుష్ప 2: ది రూల్: 70.81 కోట్లు
3. దేవర: 61.65 కోట్లు
4. సలార్: 50.49 కోట్లు
5. కల్కి 2898 AD: 44.86 కోట్లు
6. బాహుబలి 2: 43 కోట్లు
7. గేమ్ ఛేంజర్: 39.52 కోట్లు
8. గుంటూరు కారం: 38.88 కోట్లు
9. సైరా నరసింహారెడ్డి: 38.75 కోట్లు
10. సాహో: 36.52 కోట్లు
11. సర్కారు వారి పాట: 36.01 కోట్లు
12. ఆదిపురుష్: 32.84 కోట్లు
13. సరిలేరు నీకెవ్వరు: 32.77 కోట్లు
14. వకీల్ సాబ్: 32.24 కోట్లు
15. ఆచార్య: 29.50 కోట్లు