అపరిచితుడు రీ రిలీజ్… గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

చియాన్ విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 18 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం అపరిచితుడు.

Update: 2024-05-15 05:30 GMT

చియాన్ విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 18 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం అపరిచితుడు. 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 2005 లో ఏకంగా 14 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ ఇమేజ్ కూడా టాలీవుడ్ లో పెరిగింది. తర్వాత నుంచి అతని సినిమాలు అన్నీ కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

విలక్షణ నటుడిగా చియాన్ విక్రమ్ తనదైన ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడానికి అపరిచితుడు ఒక కారణం అయ్యిందని చెప్పొచ్చు.. నిజానికి విక్రమ్ నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసింది టాలీవుడ్ లోనే. కానీ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయింది కోలీవుడ్ ఇండస్ట్రీలో. అపరిచితుడు సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు విక్రమ్ ను ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. ఆ మూవీలో మూడు విభిన్న పాత్రలలో విక్రమ్ జీవించాడని చెప్పాలి.

మల్టీ పర్సనల్ డిజాస్టర్ వ్యక్తిగా విభిన్నమైన పెర్ఫార్మన్స్ తో విక్రమ్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాని మరల ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. మే 17న అపరిచితుడు మూవీ 4k వెర్షన్ లో థియేటర్స్ లోకి రాబోతోంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఆ స్పేస్ ను అపరిచితుడు మూవీ ఉపయోగించుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 240 స్క్రీన్స్ లో అపరిచితుడు మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గత మూడేళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఆరంభంలో కొంత ప్రేక్షకులు రీరిలీజ్ సినిమాలపై ఆసక్తి చూపించిన ప్రస్తుతం అంతగా దృష్టి సారించడం లేదు. మరి ఇలాంటి సమయంలో అపరిచితుడు మూవీ ఏ మేరకు అలరిస్తుంది అనేది వేచి చూడాలి.

చియాన్ విక్రమ్ కెరీర్ లో కూడా అపరిచితుడు తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో చేస్తున్న తంగలాన్ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. పిరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ట్రైబల్ వారియర్ గా విక్రమ్ విభిన్నమైన గెటప్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమా పైన విక్రమ్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News