ఆ బ్యూటీ కెరీర్ ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ!
మలయాళం బ్యూటీ అపర్ణా బాలమురళీ టాలీవుడ్ కి సుపరిచితమే. ఎన్నో అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
మలయాళం బ్యూటీ అపర్ణా బాలమురళీ టాలీవుడ్ కి సుపరిచితమే. ఎన్నో అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ తెలుగులో మాత్రం అవకాశాలు అందుకోవడంలో విఫలమవుతుంది. తొమ్మిదేళ్ల క్రితమే మాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచి సొంత పరిశ్రమలో తిరుగులేని నాయికగా కొనసాగుతుంది. మధ్యలో ఆరేడు తమిళ సినిమాలు కూడా చేసింది. కానీ కోలీవుడ్ లో కూడా పాగా వేయలేకపోయింది.
అవకాశం వస్తే నటించి వెళ్లిపోవడం తప్ప తనదైన మార్క్ మాత్రం తమిళ్ లోనే వేయలేదు. ప్రస్తుతం మలయా ళంలో ఐదారు సినిమాలు చేస్తుంది. మరి టాలీవుడ్ కి ఎందుకు దూరంగా ఉన్నట్లు? మాలీవుడ్ భామలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. గత ఐదారేళ్లగా ఎక్కువగా హీరోయిన్లు అక్కడ నుంచే ఎక్కువగా దిగుమతి అవుతు న్నారు. వాళ్లకు మంచి సక్సెస్ రేట్ ఉంది. దర్శక, నిర్మాతలు తొలి ఆప్షన్ గా సౌత్ భామల్నే చూస్తున్నారు.
మాలీవుడ్..శాండిల్ వుడ్ భామలకు ఇచ్చిన ప్రాధాతన్యత ముంబై భామలకు ఇప్పుడివ్వడం లేదు. అందులోనూ మలయాళం బ్యూటీలు మరింత క్రేజీగా మారడంతో? తొలి ప్రాధాన్యత వాళ్లకే కనిపిస్తుంది. కీర్తి సు రేష్, సంయుక్తా మీనన్, నిదేధా థామస్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వారు టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ లు చూసారు. కానీ అపర్ణ బాల మురిళికి మాత్రం ఆ రకమైన ఛాన్స్ లు రాలేదు.
హీరోయిన్ ఛాన్సులు పక్కన బెడితే కనీసం సెకెండ్ లీడ్.. కీలక పాత్రలు ఒడిసి పట్టుకోవడంలో కూడా విఫలమైంది. అందుకే టాలీవుడ్ లో చెప్పుకోవడానికి ఒక్క చిత్రం కూడా కనిపించలేదు. కానీ అపర్ణ బాల మురళీ అంటే తెలియని తెలుగు ఆడియన్ ఉండడు. టాలీవుడ్ మీడియాలో సైతం అమ్మడి పేరు చర్చకొస్తుంటుంది. ఈ విషయంలో అపర్ణకి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న ఈ సామెత సరిపోతుందేమో.