స్టార్ డైరెక్టర్‌కి ఆ విషయంలో అసంతృప్తి
ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సికందర్ సినిమా కోసం మురుగదాస్ కి బడ్జెట్ పరంగా కోతలు పెట్టారని ప్రచారం సాగుతోంది.
పాన్ ఇండియా ట్రెండ్ లో చాలామంది నిర్మాతలు రాజీ అన్నదే లేకుండా తమ సినిమా కోసం పెట్టుబడులు పెడుతున్నారు. తెరపై లావిష్‌గా సినిమా రావాలని ఎగ్జోటిక్ విదేశీ లొకేషన్ల కోసం వెంపర్లాడుతున్నారు. భారీగా సెట్లు వేసి విదేశీ డ్యాన్సర్లతో పాటలను చిత్రీకరిస్తున్నారు. గేమ్ ఛేంజర్ లో కేవలం మూడు పాటల చిత్రీకరణ కోసం దిల్ రాజు 70 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారని టాక్ వినిపించింది. ఈ రోజుల్లో ఒక మిడ్ రేంజ్ హీరో సినిమాకి అయ్యే మొత్తం బడ్జెట్ మూడు పాటలకే పెట్టించాడు శంకర్.
ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సికందర్ సినిమా కోసం మురుగదాస్ కి బడ్జెట్ పరంగా కోతలు పెట్టారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సికందర్ బడ్జెట్ అదుపు తప్పింది. దీంతో సల్మాన్ ఖాన్ బృందం మురుగదాస్ కి డబ్బు ఖర్చు విషయంలో పరిమితులు విధించారట. దీనివల్ల లండన్ సహా విదేశాల్లో చేయల్సిన షెడ్యూల్ ని మురుగదాస్ ముంబైలోనే లాగించేస్తున్నాడని, బడ్జెట్ పరిమితుల విషయంలో అతడు కొంత అసంతృప్తిగా ఉన్నాడని కూడా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతానికి రాజీకొచ్చి మురుగదాస్ తన పని తాను చేసుకుపోతున్నాడు. తాను అనుకున్న విధంగా వందశాతం విజువల్స్ ని క్యాప్చుర్ చేయలేకపోయాననే అసంతృప్తి అతడికి ఉందని గుసగుస వినిపిస్తోంది. శంకర్ తర్వాత భారతదేశంలో పాపులర్ తమిళ డైరెక్టర్ గా మురుగదాస్ కి బాలీవుడ్ లోను గుర్తింపు ఉంది. కానీ అతడికి బడ్జెట్ పరంగా స్వేచ్ఛ లేకపోవడం నిరుత్సాహపరిచిందని గుసగుస వినిపిస్తోంది.
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న సికందర్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఫైట్స్, పాటలు లావిష్ గా తెరపై కనిపిస్తాయని చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ కోసం దిల్ రాజు సుమారు 450 కోట్ల బడ్జెట్ ని వెచ్చించగా, సల్మాన్ ఖాన్ సికందర్ కోసం సాజిద్ నడియాడ్‌వాలా 400 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. బడ్జెట్ అదుపు తప్పడంతో సల్మాన్ భాయ్ మురుగదాస్ కి కొత్త పరిమితులు విధించారట.
అభిమానులకు ఈద్ కానుక:
ఈద్ 2025న సికందర్ ని విడుదల చేయాలనేది ప్లాన్. అభిమానులు తమ ఫేవరెట్ భాయిజాన్‌ను హై ఆక్టేన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో పూర్తి యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ చిత్రాన్ని సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక.