యువ సంగీత సంచలనానికి రెహమాన్ విన్నపం!
యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ సౌత్ లో ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు.
యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ సౌత్ లో ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే? అనిరుద్ పేరే వినిపిస్తుంది. `విక్రమ్`, `జైలర్` లాంటి సినిమాలతో పాన్ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. స్టార్ హీరోలంతా అనిరుద్ మ్యూజిక్ నే కొరుకుంటున్నారు. ఇతర భాషల స్టార్లు సైతం అనిరుద్ కావాలంటున్నారు.
`వై దిస్ ఇస్ కొలవెరి` నుంచి గత ఏడాది రిలీజ్ అయిన `దేవర` వరకూ అనిరుద్ ఓ సంచలనంగా మారడమే ఇంతటి క్రేజీకి దారి తీసింది. అనిరుద్ కి మ్యూజిక్ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. పూనకాలు తెప్పించే ఆ మాస్ బీజీఎంలో అనిరుద్ స్పెషలిస్ట్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా అనిరుద్ కి మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ .రెహమాన్ కొన్ని సూచనలిచ్చారు. రెహమాన్ సంగీతం అందిస్తున్న `కాదలిక్క నేరమిల్లై` ఆడియో లాంచ్ లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
`అనిరుద్ మంచి సంగీతం అందిస్తున్నాడు. కానీ ఆయనకు నా చిన్న విన్నపం ఏంటంటే? సాంగ్ లైఫ్ టైం ఎక్కువగా ఉండాలంటే ఒక క్లాసికల్ పాటను కూడా అందించాలి. ఎందుకంటే అలా చేస్తేనే యంగర్ జనరేషన్ కి బాగా రీచ్ అవుతుంది` అని సలహా ఇచ్చారు. మరి ఈ సలహాని అనిరుద్ తీసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. ఇంత వరకూ అనిరుద్ నుంచి సరైన క్లాసిక్ సాంగ్ ఒక్కటి కూడా లేదు.
మ్యూజికల్ గా సక్సెస్ అయినా? ఇప్పటి వరకూ కెరీర్ లో ఒక్క క్లాసిక్ లేదు. యువతలో క్లాసిక్ పాటలకు ఉన్న క్రేజ్ వేరు. అదే విషయాన్ని రెహమాన్ చెప్పారు. రెహమాన్ కెరీర్ లో ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి. ఆయన అంతటి లెజెండ్ అవ్వడానికి కారణం ఆ క్లాసిక్ సాంగ్సే. అనిరుద్ కి మరింత మంచి భవిష్యత్ ఉండాలంటే? ఇలాంటి క్లాసిక్ సాంగ్స్ ని అప్పుడప్పుడు టచ్ చేయాలి. మరి అనిరుద్ మనసులో ఏముందో.