త‌ళా అజిత్ కాంపౌండ్ హీరో ఇత‌డు?

కెరీర్ ప్రారంభ రోజుల నుండి అజిత్‌తో తన అనుబంధాన్ని వెల్లడించే ప్రేమపూర్వ‌క‌ నోట్‌ను రాశాడు.

Update: 2024-10-26 21:30 GMT

యువ‌న‌టుడు అర్జున్ దాస్ కోలీవుడ్ లో బిజీయెస్ట్ స్టార్ల‌లో ఒక‌రు. తన ఘాటైన ప్రదర్శనలు, గంభీర‌మైన బేస్ వాయిస్‌తో సౌత్‌లో భారీ అభిమానులను కలిగి ఉన్నాడు. అత‌డు ఇప్పుడు త‌న కెరీర్ కీల‌క ట‌ర్న్ లో త‌ళా అజిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో కీలక పాత్రలో అవ‌కాశం అందుకున్నాన‌ని తెలిపాడు.

గత రాత్రి, అర్జున్ దాస్ X లో తన ఎమోష‌న్‌ని వెల్ల‌డించాడు. కెరీర్ ప్రారంభ రోజుల నుండి అజిత్‌తో తన అనుబంధాన్ని వెల్లడించే ప్రేమపూర్వ‌క‌ నోట్‌ను రాశాడు. మేనేజర్ సురేష్ చంద్ర తనను డి`వన్‌`లో అజిత్ సర్ ప్ర‌మోష‌న‌ల్ టీమ్‌లో ఒక‌డిగా ఉండేందుకు అవ‌కాశం క‌ల్పించాడని అర్జున్ వెల్లడించాడు. ''తన సినిమా సెట్స్‌లో అజిత్‌ని సందర్శించడానికి వెళ్ల‌డం.. అతడు సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండటం.. ఆయ‌న‌ సినిమాల మార్కెటింగ్ & ప్రమోషన్‌లలో పాల్గొనడం ...సినిమాల రేడియో స్పాట్‌ల కోసం నా వాయిస్‌ని ఇవ్వడానికి ... ప్రేక్షకుల స్పందనను చూడటానికి మొదటి రోజు థియేటర్ సందర్శనలకు వెళ్లడం... అదంతా నిన్నటి రోజున జరిగినట్లు అనిపిస్తుంది'' అని అర్జున్ ట్వీట్ చేశాడు. ''నమ్మండి లేదా నమ్మక‌పోండి.. వీరమ్ టీజర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది నేనే..'' అని అత‌డు ఎక్స్ లో తెలిపాడు.

అర్జున్ కొన్నాళ్లుగా అజిత్ తనపై చూపించిన దయ మంచి త‌నం గురించి రాస్తూనే ఉన్నాడు. ''సంవత్సరాలుగా స్థిరంగా ఉన్న ఒక విషయం అజిత్ సర్ దయ, దాతృత్వం. మాస్టారు నాకు ఫోన్ చేసి ''అర్జున్ మనం త్వరలో కలిసి పని చేస్తాం'' అని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. ఇది చివరకు జరిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. నేను త‌ళా అజిత్‌తో స్క్రీన్‌ని షేర్ చేసుకుంటున్నాను. నిజంగా నా కల నిజమైంది. ఆయ‌న ఆఫీస్‌లో పని చేయడం నుండి ఆయ‌న‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం వరకు.. జీవితం పూర్తి వృత్తంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది'' అన్నారాయన.

చివరగా అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' దర్శకుడు ఆదిక్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, అజిత్ అభిమానుల నిరంతర మద్దతుకు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ''అజిత్ సర్, నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను మీ అంచనాలకు అనుగుణంగా ప‌ని చేస్తానని నిజంగా ఆశిస్తున్నాను. ఇది ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని ఎప్పటికీ అనుస‌రిస్తాను''అని ఎమోష‌న‌ల్ నోట్ ని ముగించాడు.

Tags:    

Similar News