నా నోరు చాలా సంవత్సరాలుగా మూగ‌పోయింది! అర్జున్

ఇప్పుడు మాజీ ప్రేయ‌సి మ‌లైకా ఒక ఈవెంట్లో త‌న కెరీర్ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ అన్నిటికీ అద్భుత‌మైన డ్యాన్సుల‌తో మ‌తులు చెడ‌గొట్టింది.

Update: 2025-02-14 22:30 GMT

ఆ ఇద్ద‌రి డేటింగ్ మీడియాలో ఎప్పుడూ సెన్సేష‌నే. కొన్నేళ్ల పాటు నిరాటంకంగా ప్రేమాయ‌ణం సాగించారు. కానీ ఇటీవ‌ల విడిపోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. బ్రేక‌ప్ త‌ర్వాత కూడా ఇద్ద‌రూ స్నేహంగా ఉన్నారు. ఇలాంటి ప‌రిణ‌తి కేవ‌లం బాలీవుడ్ స్టార్ల‌లో మాత్ర‌మే చూడ‌గ‌లం. ఇదంతా అర్జున్ క‌పూర్- మలైకా అరోరా గురించే.

ఇప్పుడు మాజీ ప్రేయ‌సి మ‌లైకా ఒక ఈవెంట్లో త‌న కెరీర్ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ అన్నిటికీ అద్భుత‌మైన డ్యాన్సుల‌తో మ‌తులు చెడ‌గొట్టింది. అయితే ఆ డ్యాన్సుల్ని అర్జున్ జ‌నంలోంచి చాలా సాధార‌ణ యువ‌కుడిలా వీక్షించి ఆస్వాధించాడు. త‌న సినిమా కోస్టార్ భూమి ఫెడ్నేక‌ర్ తో క‌లిసి అర్జున్ ఎంజాయ్ చేసాడు. అయితే త‌న మాజీ ప్రేమికుడి ముందు మ‌లైకా అద్భుత‌మైన నృత్యాల‌తో అద‌ర‌గొట్టింది.

'ఇండియాస్ బెస్ట్ డాన్సర్ వర్సెస్ సూపర్ డాన్సర్' ఈవెంట్లో మలైకా వ‌రుస‌గా చార్ట్ బ‌స్ట‌ర్ల‌కు డ్యాన్స్ చేసింది. మున్నీ బద్నామ్.. చయ్య చయ్య వంటి క్లాసిక్ సాంగ్స్‌కి స్టెప్పులేస్తూ ర‌క్తి క‌ట్టించింది. అర్జున్ కూడా ''మ‌లైకా మేరీ బోల్టీ బంద్ హో చుకి హై సాలోన్ సే'' అని ఫ‌న్నీగా వ్యాఖ్యానించాడు. దీని అర్థం ''నా నోరు చాలా సంవత్సరాలుగా మూగ‌పోయింది'' అని. ఇప్పుడు మ‌లైకా కార‌ణంగా అది తెరుచుకుంది. మ‌లైకా అద్బుత‌మైన నృత్యాల‌కు ప్ర‌పంచం ఎప్పుడో దాసోహం అంది. ఇష్ట‌మైన పాట‌లు వినేందుకు నాకు అవ‌కాశం ల‌భించింది అని అర్జున్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా మ‌లైకాకు అభినంద‌న‌లు తెలిపాడు.

Tags:    

Similar News