'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సెన్సార్ టాక్.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

మొత్తానికి ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకొని విడుదలకు రెడీ అయింది. ఇప్పటివరకు తల్లి-కొడుకుల బంధంపై చాలా రకాల సినిమాలు వచ్చాయి.;

Update: 2025-04-08 11:06 GMT
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెన్సార్ టాక్.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

ఈ వేసవికి ఓ మంచి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా థియేటర్లలో సందడి చేస్తే ఆ హడావుడి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక నందమూరి కళ్యాణ్‌రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకొని విడుదలకు రెడీ అయింది. ఇప్పటివరకు తల్లి-కొడుకుల బంధంపై చాలా రకాల సినిమాలు వచ్చాయి.

కానీ ఈసారి కళ్యాణ్ రామ్ యాక్షన్ తో పోలీస్ ఆఫీసర్ గా ఉండే తల్లికి ఎలా ఎదురెళ్ళాడు అనేది హైలెట్ పాయింట్. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య తెరపై కనిపించే అనుబంధం ఒకవైపు ఆకట్టుకుంటూనే మరోవైపు పరిస్థితుల వలన ఊహించని యుద్ధం మొదలవుతుందని విడుదలైన టీజర్, ట్రైలర్‌ ద్వారా అర్థమైంది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన టాక్ ప్రకారం, సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

కథ మొత్తం తల్లి-కొడుకు రిలేషన్ చుట్టూ తిరుగుతుంది. రెండవ భాగంలో వారి మధ్య ఉండే సంఘర్షణలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల గుండెను హత్తుకుంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా విజయశాంతి ఇంట్రడక్షన్ సీన్ మళ్లీ ఆమె గోల్డెన్ డేస్‌ను గుర్తు చేస్తుందని చెబుతున్నారు. కథ, స్క్రీన్‌ప్లే పరంగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మంచి బ్యాలెన్స్‌ చూపించారని తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌లు, చక్కటి ఎమోషనల్ డైలాగ్స్‌ అన్నీ కలిసి సినిమాకు బలాన్ని ఇచ్చినట్లు టాక్.

సినిమా మొత్తం కేవలం 2 గంటల 24 నిమిషాల పాటు సాగుతుందన్నది మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసే తీరు, ఇంట్రడక్షన్ సీన్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుందట. సాంకేతికంగా కూడా ఈ సినిమా పక్కాగా ఉందని సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

అలాగే డీఓపీ రామ్ ప్రసాద్ సినిమాకు మెరుగైన విజువల్ ఫీల్ ఇచ్చారని టాక్. కలర్స్, లైటింగ్ నుంచి ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్రాండ్‌నెస్ కనిపిస్తుందట. ఇక క్లయిమాక్స్ సీన్స్ కూడా సినిమాకు ప్రధాన భలం అని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లోనే దర్శకుడు పవర్ఫుల్ సీన్స్ ను హైలెట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి, ‘అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి’ అనే టైటిల్‌తోనే ఇంట్రెస్ట్ పెంచిన ఈ సినిమా, ఇప్పుడు కంటెంట్ పరంగా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఏప్రిల్ 18న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. బిజీగా ఉన్న సమ్మర్ సీజన్‌లో ఒక మంచి కమర్షియల్ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది సరైన మాస్ ఫ్యామిలీ ప్యాకేజ్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఆ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News