140 రోజుల్లో 110 రోజులు అదే పనా!
నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.;

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలో కీలక పాత్ర పోషించడం అదనపు అస్సెట్ గా కలిసొచ్చింది. హీరో పాత్రతో పాటే విజయశాంతి రోల్ ధీటుగా ఉంటుందని ఇప్పటికే రివీల్ చేసారు.
58 లోనూ విజయశాంతి యాక్షన్ సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనిచేసారని..ఎలాంటి డూప్ లేకుండానే షూటింగ్ లో పాల్గొన్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ సినిమా గురించి చిత్ర నిర్మా తలు అశోక్ వర్దన్ ముప్పా- సునీల్ బలుసు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషజ్ఞాలు రివీల్ చేసారు. ఆవేంటో ఆవారి మాటల్లోనే.. `కల్యాణ్ రామా మాకు మంచి స్నేహితుడు. అతడితో కమర్శియల్ సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.
అది ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా మొదట చూసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అనంతరం ఆయన ఫోన్ చేసి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ కథ గురించి ఎవరెన్ని అనుకున్నా? వాళ్ల అంచనాలకు భిన్నంగా ఈ చిత్ర ఉంటుంది. ఈ సినిమా మొత్తం షూటింగ్ 140 రోజులు చేసాం. అందులో 110 రోజులు కేవలం యాక్షన్ సన్నివేశాలే షూట్ చేసాం. యాక్షన్ తో పాటే కథ ట్రావెల్ అవుతుంది. చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది.
ఇలాంటి కథనాలు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే కుదురుతుంది. అందులో మా సినిమా ఒకటిగా ఉంటుంది` అన్నారు. 110 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారంటే? ఇందులో ఏ రేంజ్ యాక్షన్ ఉందో ఊహించొచ్చు. మరి ఆ యాక్షన్ సన్నివేశాలు ఎంత స్టైలిష్ గా తీసారు? అన్నది ముఖ్యం.