అలాంటి వారు ఈ సినిమాను చూడాలి

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన 'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి' సినిమా విడుదలకు సిద్ధం అయింది.;

Update: 2025-04-01 05:13 GMT
అలాంటి వారు ఈ సినిమాను చూడాలి

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన 'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఇటీవలే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా విజయశాంతిని చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడటంతో ఆమె ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత కూడా విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా అంతే ఫిట్‌గా కనిపించడం నిజంగా షాకింగ్గా ఉందని ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సినిమా ప్రమోషన్‌ను జోరుగా సాగిస్తున్నారు. టీజర్ విడుదలైన తక్కువ గ్యాప్‌లోనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన చిత్ర యూనిట్‌ సభ్యులు అంచనాలు మరింతగా పెంచారు.

తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా నరసరావుపేటలో కళ్యాణ్ రామ్‌ యూనిట్‌ సభ్యులతో సందడి చేశారు. అక్కడ జరిగిన ఈవెంట్‌లో పాటను విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమాను ప్రతి తల్లి కొడుకు చూడాలని అన్నాడు. తల్లి కొడుకు మధ్య ఉండే అనుబంధం గురించి ఈ సినిమాలో ప్రముఖంగా చూపించినట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తల్లి గొప్పతనం గురించి కూడా ఈ సినిమాలో ప్రముఖంగా చూపించామని కళ్యాణ్ రామ్‌ అన్నాడు. ఈ సినిమాలో విజయశాంతి గారు నటించేందుకు ఒప్పుకోవడం గొప్ప విషయం అన్నాడు.

ప్రతి ఇంట్లో కొందరు పిల్లలు తల్లులను తక్కువ చూపు చూస్తూ ఉంటారు. వారు ఏం చేయడం లేదని, ఇంట్లోనే ఉంటున్నారని అనుకుంటారు. కాని ప్రతి తల్లి కుటుంబం కోసం ఎంతో చేస్తుంది. ఆమె చేసే ప్రతి పని నిస్వార్థంగా చేస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి ఈ సినిమాలో చూపించామని కళ్యాణ్‌ రామ్ అన్నారు. తల్లి అంటే గౌరవం లేని వారు, తల్లి గురించి తక్కువగా ఆలోచించే వారు ఈ సినిమాను చూడాలని కళ్యాణ్ రామ్‌ సూచించాడు. తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని, ఇంటి కోసం, ఇంట్లో వారు అందరి కోసం నిస్వార్థంగా పని చేసే గొప్ప వ్యక్తి తల్లి అని కళ్యాణ్ రామ్ తల్లి గొప్పతనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కళ్యాణ్ రామ్‌ గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేక పోయాడు. ఈ సినిమా తన సినిమా అతనొక్కడే సినిమా తరహాలో మరపురాని సినిమాగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయశాంతి నటించడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. సినిమా టీజర్ విడుదలతో కథపై ఒక అవగాహన వచ్చింది. పోలీస్‌ ఆఫీసర్ అయిన వైజయంతి డ్యూటీలో భాగంగా కొడుకు అర్జున్‌ను అరెస్ట్‌ చేస్తుంది. అర్జున్‌ ఎందుకు తన తల్లికే వ్యతిరేకంగా వెళ్తాడు అనేది కథాంశం. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని కళ్యాణ్ రామ్‌ భావిస్తున్నాడు.

Tags:    

Similar News