రియ‌ల్ లైఫ్ లో అన్నా-చెల్లి! మ‌రి రీల్ లైఫ్ లో?

రియ‌ల్ లైఫ్ లో వాళ్లిద్ద‌రు సొంత అన్నా-చెల్లెళ్లు. ఒకే త‌ల్లి క‌డుపున పుట్ట‌క‌పోయినా తండ్రి ఒక్క‌రే. అలా వారిద్దిరి మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా అన్నా-చెల్లి బంధం కొన‌సాగుతుంది.

Update: 2024-08-03 05:16 GMT

రియ‌ల్ లైఫ్ లో వాళ్లిద్ద‌రు సొంత అన్నా-చెల్లెళ్లు. ఒకే త‌ల్లి క‌డుపున పుట్ట‌క‌పోయినా తండ్రి ఒక్క‌రే. అలా వారిద్దిరి మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా అన్నా-చెల్లి బంధం కొన‌సాగుతుంది. అన్న‌య్య అంటే చెల్లికి అంతే ఇష్టం. ఆ చెల్లి అన్నా అన్న‌య్య అంతే ప్రేమ కురిపిస్తాడు. మ‌రి రియ‌ల్ లైఫ్ లో అన్నా అన్నా-చెల్లి అయినా ఆ జోడీ రీల్ లైఫ్ లో క‌లిసి న‌టించ‌డానికి రెడీ అవుతున్నారా? సినిమాలో అన్నా-చెల్లి బంధమా? లేక ఇంకేదైనా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారా? అన్న‌ది స‌స్పెన్స్.

ఇంత‌కీ ఆ అన్నా-చెల్లి ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. వాళ్లెవ్వ‌రో కాదు బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ కుమార్తె-కుమారుడు. బోనీ క‌పూర్ మొద‌టి భార్య మోనా శౌర్యా కుమారుడు అర్జున్ క‌పూర్ కాగా, రెండ‌వ భార్య కి పుట్టిన పిల్ల‌లు జాన్వీ క‌పూర్- ఖుషీ క‌పూర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే జాన్వీ తెరంగేట్రం చేసి దిగ్విజ‌యంగా రాణిస్తోంది. `ది అర్చీస్` సిరీస్ తో ఖుషీ కూడా లాంచ్ అయింది.

ప్ర‌స్తుతం హీరోయిన్ గా క‌రణ్ జోహార్ బ్యాన‌ర్ హీరోయిన్ గా తొలి సినిమా చేస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఖుషీ క‌పూర్ కి అన్న‌య్య అర్జున్ క‌పూర్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఓ హిట్ చిత్రానికి రీమేక్ గా ఖుషీతో న‌టిస్తున్న‌ట్లు ఇన్స్టా వేదిక‌గా రివీల్ చేసాడు. తెర‌పైకి తొలిసారి అర్జున్-ఖుషీ అంటూ విష‌యాన్నిచెప్పాడు క‌పూరో బోయ్. దీంతో ఆ వార్త ఆస‌క్తిక‌రంగా మారింది.

అర్జున్ క‌పూర్ కి జోడీగా ఖుషీ క‌పూర్ న‌టిస్తుందా? లేక రియ‌ల్ లైఫ్ త‌రహా అన్నా-చెల్లి పాత్ర అవుతుందా? ఈ రెండు గాక కపూర్ బోయ్ సినిమాలో ఖుషీ ని ఏదైనా కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసాడా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? అన్న వివ‌రాలు మాత్రం రివీల్ చేయ‌లేదు. మ‌రి ఈ ఛాన్స్ పై ఖుషీ క‌పూర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News