మలైకాతో పెళ్లిపై అర్జున్ కపూర్ ఏమన్నారంటే
మలైకాతో తన అనుబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8 మిశ్రమ స్పందనలతో ముందుకు సాగుతోంది. కానీ కరణ్ జోహార్ తనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. తాజా ఎపిసోడ్లో మలైకా స్నేమితుడు కపూర్ బోయ్ ని కరణ్ టార్గెట్ చేయడం చర్చకు వచ్చింది. అయితే అర్జున్ కపూర్ తన చిరకాల స్నేహితురాలు మలైకా అరోరాతో తన సంబంధం గురించి షోలో ఎంతో నిజాయితీగా చెప్పాడు. హోస్ట్ కరణ్ జోహార్ ఒక ప్రశ్న అడిగారు. మలైకాతో తన అనుబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. త్వరలోనే ఎప్పుడైనా పెళ్లికి ఆస్కారం ఉందా? అన్నది అతడి ప్రశ్న.
దానికి సమాధానమిస్తూ అర్జున్ ఇలా అన్నారు. ''నేను ఈ సమయంలో అనుకుంటున్నది.. నేను నిజాయితీగా ఉండటాన్ని ఎంతగానో ఇష్టపడతాను. ఇది నా జీవితంలో భాగమని భావిస్తున్నాను. ప్రస్తుతం నేను దానిని ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నాను'' అని అర్జున్ చెప్పాడు. అయితే ఆమె(మలైకా) లేకుండా ఇక్కడ కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడటం అన్యాయమని భావిస్తున్నాను. ఇది అత్యంత గౌరవప్రదమైన విషయం.. ఆ దశకు చేరుకోగానే కలిసి మాట్లాడుకుంటాం. నేను ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సౌకర్యవంతమైన సంతోషకరమైన ప్రదేశంలో జీవించి ఉన్నామనేది వాస్తవం`` అని అన్నారు. నేను ప్రస్తుతం దేని గురించి ప్రత్యేకంగా మాట్లాడదలచుకోలేదు.. ఎందుకంటే దాని గురించి ఒంటరిగా మాట్లాడటం మా అనుబంధానికి అన్యాయమని నేను భావిస్తున్నాను! అని కూడా అర్జున్ కపూర్ అన్నారు.
కొన్ని నెలల క్రితం అర్జున్ -మలైకా జంటపై రకరకాల పుకార్లు షికార్ చేసాయి. ఐదు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత బ్రేకప్ అయిందని పుకార్లు వ్యాపించాయి. అయితే అర్జున్ తన లేడీ లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జంటగా ఉన్న రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేసి పుకార్లకు చెక్ పెట్టాడు. ఆ తర్వాత పలుమార్లు మలైకాతో కలిసి ఈవెంట్లలో జంటగా కనిపించాడు.
తాజాగా మలైకా కూడా ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ రూమర్స్ గురించి ప్రస్తావించింది. ప్రముఖ జాతీయ మీడియాతో మలైకా మాట్లాడుతూ, ''నా వ్యక్తిగత విషయాల గురించి నేను ఇప్పుడు చర్చించదలచుకోలేదు. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఏమీ స్పష్టం చేయనవసరం లేదు.. ఎందుకంటే చెప్పవలసినది ఇప్పటికే చెప్పాను'' అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.