ఆ సినిమా సెట్స్ లో 'గజినీ-2' డిస్కషన్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన `గజనీ` సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన `గజనీ` సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లో రిలీజ్ అయిన సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించి. సూర్య కెరీర్ లోనే ఓమైల్ స్టోన్ చిత్రంగా మిగిలిపోయింది. అటుపై ఇదే చిత్రాన్ని మురగదాస్ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేసి అక్కడ రికార్డులు మోత మోగించారు. అలా అమీర్ ఖాన్- మురగదాస్ మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది.
ఈ ఇమేజ్ మురగదాస్ కి ఎన్నో హిందీ అవకాశాలు వచ్చాయి. అయితే తాజాగా `గజినీ-2` అంశం తెరపైకి వస్తోంది. అమీర్ ఖాన్ `గజినీ-2`పై ఆసక్తిగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అందుకు `కూలీ` సెట్స్ వేదికగా మారింది. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ కాన్వాస్ పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, పహాద్ పాజిల్ ఇందులో నటిస్తున్నారు.
ఇదే సినిమాలో అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా సెట్స్ లో నే `గజినీ-2` డిస్కషన్ రాగా అమీర్ ఖాన్ బాలీవుడ్ లో చేస్తున్నాడనే విషయం వెలుగులోకి వస్తోంది. స్టార్లు అంతా `గజినీ-2` గురించి మాట్లాడుకున్నారుట. ఇప్పటికే అమీర్ తో `కూలీ` దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సినిమా చేస్తాడనే ప్రచారంలో ఉంది. ఇది 2026 లో ఉంటుందని అంటున్నారు.
అయితే అంతకంటే ముందు అమీర్ ఖాన్ గజనీ-2 చేసే అవకాశాలున్నాయని మాట్లాడుకుంటున్నారుట. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. `గజనీ-2` చేస్తే అది మురగదాస్ మాత్రమే అవ్వాలి. అతడు తప్ప ఆ సబ్జెక్ట్ ని మరొకరు డీల్ చేయలేరు. ప్రస్తుతం మురగదాస్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో `సికందర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.