మ్యూజిక్ సంచ‌ల‌నంపై విమ‌ర్శ‌లా?

ఇటీవ‌ల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ఛావా` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-18 15:30 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ఛావా` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా 200 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. లాంగ్ ర‌న్ లో ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ కు చారిత్రాత్మ‌క సినిమాలు చేయ‌డంతో ఇదే తొలిసారి అయినా? ఎంతో అనుభ‌వం గ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసాడు.

ప్ర‌తీ ప్రేమ్ ను ఎంతో అందంగా మలిచాడు. శంభాజీ మ‌హార‌జ్ క‌థ‌ను తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు 100 శాతం ప్ర‌జెంట్ చేసాడు. అత‌డి విజ‌న్ కి త‌గ్గ‌ట్టు అత‌డి టీమ్ అంతా ప‌నిచేయ‌డంతో ఇంత గొప్ప ఫ‌లితం సాధ్య‌మైంది. అయితే ఈ సినిమా సంగీతం విష‌యంలో కొంత అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సినిమాకు ఏ. ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.

కానీ మ్యూజికల్ గా సినిమా స‌క్సెస్ అవ్వ‌లేద‌ని...రెహ‌మాన్ సంగీతం విష‌యంలో నేల విడిచి సాము చేసిన‌ట్లు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. సినిమాకి స‌రైన పాటలుగానీ, నేప‌థ్య సంగీతం గానీ అందించ‌లేద‌ని సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు మండిప‌డుతున్నారు. ఒక‌ప్ప‌టి రెహ‌మాన్ ఎక్క‌డ‌? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాల‌కు ఆర్ ఆర్ అత్యంత కీల‌కం.

కానీ రెహ‌మాన్ అక్క‌డ ఏమాత్రం మెప్పించ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చారీత్రాత్మ‌క సినిమాకి కావాల్సిన విధంగా సౌండింగ్ ఇవ్వ‌కుండా.... మోడ్ర‌న్ సంగీత ప‌రిక‌రాలు వాడి సంగీతం విలువ త‌గ్గించాడ‌ని మండిప‌డుతున్నారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌పై రెహ‌మాన్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. వాస్త‌వానికి గ‌త కొంత కాలంగా రెహ‌మాన్ సంగీతం అందించిన సినిమాలు మ్యూజికల్ గా సంచ‌ల‌నం అవ్వ‌ని సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News