అత్యాచారం కేసులో మరో అరెస్ట్ వారెంట్
అత్యాచారం కేసులో మరో నటుడికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
అత్యాచారం కేసులో మరో నటుడికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దేశం విడచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం అతడి పరారీలో ఉన్నాడు. ముందొస్తు బెయిల్ కోసం వేసిన పీటీషన్ కూడా కొర్టు కొట్టేసింది. దీంతో అతడు ఊచలు లెక్కించడం ఖాయమని తేలిపోయింది. ఇంతకీ ఎవరా? నటుడు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మలయాళ నటుడు సిద్దీఖీ పై ఓ నటి అత్యాచారం చేసాడంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక తెచ్చిన దైర్యంతో నటి మీడియా ముందుకు రావడంతో సిద్దీఖీ భాగోతం బయట పడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా తాజాగా సిద్దీకి అరెస్ట్ కి పోలీసులు రంగం సిద్దం చేసారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వేట మొదలు పెట్టారు. 2016 లో తిరువనంతపురం ప్రభుత్వ హోటల్ లో సిద్దీఖి తనపై అత్యాచారం చేసాడని నటి ఫిర్యాదు చేసింది. తొలుత ఈ ఘటనపై ఫిర్యాదు చేయకూడదనుకుంది.
కానీ హేమ కమిటీ ఇచ్చిన ధైర్యంగా ముందుకు రావడంతో విషయం బయట పడింది. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ప్రతిగా లైంగిక కోర్కులు తీర్చాలని సిద్దిఖీ డిమాండ్ చేసాడని నటి ఫిర్యాదు చేసింది. ఇలా లాగిన తీగతో ఢొంకంతా కదలింది. ఈ వ్యవహారంతో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన `అమ్మ` అసోసియేషన్ కార్యవర్గం కూడా రాజీనామా చేసింది. మమ్ముట్టి, మోహన్ లాల్ అంతా కూడా రాజీనామా చేసారు. బాధిత మహిళలకు అండగానూ తమ మద్దతును ప్రకటించారు.
ఇలాంటి లైంగిక ఆరోపణలతో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.