'లైగర్' క్లైమాక్స్ కోసం సెట్ లో 1000 మంది: విజయ్ దేవరకొండ

Update: 2021-07-07 14:30 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లోనే. తల్లీ కొడుకుల మధ్య సెటిమెంట్ ను కూడా పూరీ ఇందులో టచ్ చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ ను నిర్మాణ భాగస్వామిగా చేశారు. మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో 'లైగర్' చిత్రాన్ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ ముంబై లో ప్రారంభం కానుందని సమాచారం.

'లైగర్‌' మూవీ షూటింగ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో విజయ్‌ దేవరకొండ.. త్వరలోనే సెట్ లో అడుగు పెట్టబోతునట్లు వెల్లడించారు. 'లైగర్' సినిమా చిత్రీకరణ ఇప్పటికే 65 శాతం పూర్తయిందని.. తల్లీ కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్‌ సీన్స్‌ ను కూడా దాదాపు పూర్తి చేశామని విజయ్ తెలిపారు. క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ కోసం సుమారు వెయ్యి మందికి పైగా అవసరం ఉందని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో షూటింగ్ అంటే రిస్క్‌ తో కూడుకున్న పని అని వీడీ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'లైగర్‌' లాంటి భారీ సినిమా చేయడం అంటే పెద్ద సవాల్‌ అని.. కరోనా థర్డ్‌ వేవ్‌ అవకాశాలను కూడా ఆలోచించి షూటింగ్ ప్లాన్‌ రెడీ చేస్తున్నామని దేవరకొండ విజయ్ పేర్కొన్నారు.

కాగా, పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ లకు 'లైగర్' ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో VD సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో విజయ్ తల్లి పాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో రౌడీ దేవరకొండ ఓ కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడు. దీని కోసం యంగ్ హీరో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడమే కాకుండా భారీ వర్కవుట్స్ చేసే బాడీ బిల్డ్ చేసారని తెలుస్తోంది. 'లైగర్' కోసం జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ వర్క్ చేస్తున్నారు. ఆయన సారధ్యంలోనే స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన 'లైగర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగా 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి దక్షిణాది మూవీ ఫస్ట్ లుక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ థియేటర్ - డిజిటల్‌ మరియు శాటిలైట్‌ హక్కుల కోసం రూ.200 కోట్లు ఇచ్చేందుకు సుముఖుంగా ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమా మీద నమ్మకంతో ఇది చాలా చిన్న మొత్తమని.. థియేటర్లలో దీని కన్నా ఎక్కువ వసూలు చేస్తానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 'లైగర్' చిత్రానికి మణిశర్మ - తనీష్ బాగ్చి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Tags:    

Similar News