రూ.116 నుంచి 100 కోట్లు..నిఖిల్ ఇన్స్పిరేష‌న‌ల్ జ‌ర్నీ!

Update: 2022-08-27 05:45 GMT
ఇండ‌స్ట్రీలో రాణించాలంటే స‌హ‌నం, నిల‌బ‌డ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం, టాలెంట్‌.. ఇవ‌న్నింటికి మించి అదృష్టం తోడ‌వ్వాల్సిందే. ఇవ‌న్నీ లేక‌పోతే ఇండ‌స్ట్రీలో రాణించ‌డం క‌ష్ట‌మ‌ని కొంత మంది నిరూపించారు. స్వ‌యంకృషితో ఎలాంటి గాడ్ ఫాద‌ర్ లు లేకుండా ఇండ‌స్ట్రీలో రాణించ‌డం మామూలు విష‌యం కాదు. కానీ అది మ‌న సంక‌ల్పం గొప్ప‌గా వుంటే అదే మంత క‌ష్ట‌మేమీ కాద‌ని టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, బాలీవుడ్ లో అబితాబ్ బ‌చ్చ‌న్ నిరూపించారు.

ఎంత మంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా..అవ‌మాన ప‌రిచినా న‌మ్మిన దాన్ని ద‌క్కించుకోవ‌డం కోసం హీరోలుగా రాణించ‌డం కోసం అకుంఠిత దీక్షా ప‌ట్టుద‌ల‌తో ముంద‌డుగు వేశారు..సినీ చ‌రిత్ర‌లో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపించారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి మ‌రి కొంత మంది స్టార్ లు కూడా ఎలాంటి సినీ నేప‌థ్యం, గాడ్ ఫాద‌ర్ అంటూ లేకుండానే రాణించారు. త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ఇలా గాడ్ ఫాద‌ర్ లేకుండా టాలీవుడ్ లో ఎలాంటి క్రెడిట్ లేని కార్ డ్రైవ‌ర్ క్యారెక్ట‌ర్ తో త‌న సినీ ప్ర‌స్థాన్ని ప్రారంభించాడు యంగ్ హీరో నిఖిల్‌. నితిన్ హీరోగా ద‌శ‌ర‌థ్ డైరెక్ట్ చేసిన మూవీ 'సంబ‌రం' ఈ మూవీలో చిన్న రోల్ లో క‌నిపించాడు. త‌న తొలి పారితోషికం అక్ష‌రాలా రూ.116. ఆ త‌రువాత ల‌క్ష్మీ కాంత్ చెన్న రూపొందించిన డెక్క‌న్ ఫిల్మ్ 'హైద‌రాబాద్ న‌వాబ్స్' కాలేజీ స్టూడెంట్ గా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేశాడు.

అదే స‌మ‌యంలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని తెలిసి ఆడిష‌న్స్ లో పాల్గొని ఫైన‌ల్ గా సెలెక్ట్ అయ్యాడు అదే 'హ్యాపీడేస్‌'. రాజేష్ పాత్ర‌లో అప్పుకు జోడీగా న‌టించి తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. త‌న పాత్ర‌కు, యాక్టింగ్ కు మంచి గుర్తుంపు ల‌భించ‌డంతో ఇక అక్క‌డి నుంచి నిఖిల్ వెనుదిరిగి చూసుకోలేదు. 'అంకిత్‌, ప‌ల్ల‌వి అండ్ ఫ్రెండ్స్‌' మూవీతో హీరోగా జ‌ర్నీ మొద‌లైంది. 'యువ‌త‌'తో హిట్ ని అందుకున్నా ఆ త‌రువాత నిఖిల్ కెరీర్ ప‌ర్‌ఫెక్ట్ గా ట్రాక్ ఎక్క‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. అప్పుడు ప‌డింది 'స్వామిరారా' సుధీర్ వ‌ర్మ రూపొందించిన ఈ మూవీతో నిఖిల్ ప్రామిసింగ్ స్టార్ గా మారిపోయాడు.

విచిత్రం ఏంటంటే శేఖ‌ర్ క‌మ్ముల 'హ్యాపీడేస్‌'తో ప‌రిచ‌య‌మైన వారంతా ఇప్ప‌డు లైమ్ లైట్ లో లేరు కానీ అదే బ్యాచ్ నుంచి వ‌చ్చిన నిఖిల్ మాత్రం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ హీరోగా నిల‌బ‌డి త‌న స‌త్తా చాటుకుంటుండ‌టం విశేషం. ఇదిలా వుంటే నిఖిల్ న‌టించిన లేటెస్ట్ మిస్ట‌క్ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ‌2' రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ 'కార్తికేయ‌'కు సీక్వెల్ గా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. యుఎస్ లో 1.4 మిలియ‌న్ డాల‌ర్ లు క్రాస్ చేసిన ఈ మూవీ అక్క‌డ 100 కు పైగా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ రికార్డులు సృష్టిస్తోంది.

దేశ వ్యాప్తంగా డ్రీమ్ ర‌న్ తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల మార్కుని అవ‌లీల‌గా దాట‌డం విశేషం. ఎలాంటి గాడ్ ఫాద‌ర్స్ లేని ఓ హీరో రూ.116 పారితోషికంతో త‌న న‌ట‌ప్ర‌స్థానాన్ని ప్రారంభించి 'కార్తికేయ 2'తో రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం నిజంగా స్ఫూర్తి దాయ‌కం. కృషి, ప‌ట్టుద‌ల‌, మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం వుంటే ఎలాంటి అసాధ్య‌ల‌నైనా సుసాధ్యం చేసి చూపించ‌గ‌ల‌మ‌ని అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి, ర‌వితేజ చూపించిన‌ట్టే యంగ్ హీరో నిఖిల్ త‌న స్ఫూర్తి వంత‌మైన జ‌ర్నీతో నిరూపించ‌డం విశేషం.
Tags:    

Similar News