మూవీ రివ్యూ : ‘18 పేజెస్’
నటీనటులు: నిఖిల్ సిద్దార్థ-అనుపమ పరమేశ్వరన్-సరయు-అజయ్-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: వసంత్
నిర్మాత: బన్నీ వాసు
కథ: సుకుమార్
మాటలు: శ్రీకాంత్ విస్సా
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్
‘కార్తికేయ-2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్-అనుపమ కలయికలో.. వెంటనే వస్తున్న చిత్రం ‘18 పేజెస్’. ఇంతకుముందు సుకుమార్ కథతో ‘కుమారి 21 ఎఫ్’ తీసి హిట్టు కొట్టిన పల్నాటి సూర్యప్రతాప్ మరోసారి తన గురువు స్టోరీతోనే ఈ సినిమా చేశాడు. ఆసక్తికర ప్రోమోలతో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సిద్ధు (నిఖిల్ సిద్దార్థ) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. ఒక అమ్మాయిని ప్రేమించి.. మె మోసం చేయడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన అతను అనుకోకుండా నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి రాసిన పాత డైరీ చదవడం మొదలుపెడతాడు. ఈ తరం అమ్మాయిలకు భిన్నంగా ఉన్న తన మనస్తత్వం అతడికి నచ్చుతుంది. డైరీ ద్వారా తన గురించి లోతుగా తెలుసుకునే క్రమంలో ఆమెకు బాగా కనెక్టయిపోయి తనను చూడకుండానే ప్రేమలో పడిపోతాడు. కానీ ఆ డైరీ మధ్యలోకి వచ్చేసరికి ఉన్నట్లుండి బ్రేక్ పడుతుంది. పేజీలు ఖాళీగా కనిపిస్తాయి. నందిని జీవితంలో తర్వాత ఏమైందో తెలియక టెన్షన్ పడిపోయిన సిద్ధు.. తన అడ్రస్ తెలుసుకుని తనను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి అతడికో షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. నందినికి అసలేమైంది.. చివరికి ఆమెను సిద్ధు కలవగలిగాడా లేదా అన్న విషయాలు తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
సుకుమార్ తీసే సినిమాలే కాదు.. ఆయన రాసే కథలు కూడా కొంచెం టిపికల్ గా ఉంటాయి. ఇంతకుముందు ఆయన కథతో తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’ అందుకు ఉదాహరణ. సుకుమార్ రాసిన స్క్రిప్టును చక్కగా డీల్ చేసి ‘కుమారి 21 ఎఫ్’ను పెద్ద హిట్ చేశాడు ఆయన శిష్యుడు సూర్యప్రతాప్. మళ్లీ సుకుమార్ కథ.. సూర్యప్రతాప్ దర్శకత్వం అంటే చాలా ఊహించుకుంటారు ప్రేక్షకులు. వాళ్లిద్దరికీ ఈసారి నిఖిల్ సిద్దార్థ-అనుపమ పరమేశ్వరన్ లాంటి మంచి జంట.. గీతా ఆర్ట్స్-2 లాంటి పెద్ద బేనర్ సపోర్ట్ లభించింది. దీంతో ఈసారి ఇంకా బెటర్ ప్రాడక్ట్ ఆశిస్తాం. ‘18 పేజెస్’ మొదలైన తీరు.. ఒక దశ వరకు సాగిన వైనం చూశాక.. మన అంచనాలు నిజమవుతున్నట్లే అనిపిస్తుంది. కానీ ఆహ్లాదకరంగా సాగిపోతున్న ప్రేమకథలోకి.. ఒక క్రైమ్ ఎలిమెంట్ బలవంతంగా ఇరికించి దాని చుట్టూ నడిపిన ఎపిసోడ్ పుణ్యమా అని ‘18 పేజెస్’ గాడి తప్పేసింది. అప్పటిదాకా ఉన్న మంచి మూడ్ ను ఈ క్రైమ్ ఎలిమెంట్ చెడగొట్టేయడంతో.. మళ్లీ ఆ ఫీల్ తేవడానికి గట్టిగా ప్రయత్నించినా అంతగా ఫలితం లేకపోయింది. ‘18 పేజెస్’ చివరికి ఒక సగటు సినిమాలా మిగిలిపోయింది.
డైరీ నేపథ్యంలో ప్రేమకథ అనగానే చాలా ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాం. ప్రతి ఒక్కరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసి దాని చుట్టూనే ప్రపంచమంతా తిరుగుతున్న ఈ రోజుల్లో.. డైరీ.. పోస్ట్ బాక్స్.. చూడకుండా ప్రేమించుకోవడం లాంటి అంశాలతో సినిమా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఔట్ డేటెడ్ ఫీలింగ్ వస్తుంది. కానీ సుకుమార్ ఈ అంశాల మీదే కథ రాసి ఒక దశ వరకు బాగానే మెప్పించాడు. ‘ప్రియమైన నీకు’ సినిమాకు చాలా దగ్గరగా ఉండే పాయింట్ మీద సూర్యప్రతాప్ కథనం కూడా ఆసక్తికరంగానే సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేశాక అనుకోకుండా హీరో చేతికి ఈ డైరీ దొరకడం.. తాను ప్రేమించిన అమ్మాయికి పూర్తి భిన్నంగా.. ఏమాత్రం ఆధునికత అంటకుండా ఉన్న అమ్మాయి రాసిన రాతలకు కనెక్టయి ఆమెను చూడకుండానే హీరో ప్రేమించడం.. తన మాటలకు ప్రభావితం అయి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అటు డైరీ ద్వారా రెండేళ్ల కిందటి అమ్మాయి జీవితాన్ని చూపిస్తూ.. దానికి కనెక్టయ్యేలా హీరో వర్తమానాన్ని నడిపించడం ద్వారా స్క్రీన్ ప్లేను ఎంగేజింగ్ ను తీర్చిదిద్దుకున్నారు. కొంచెం ఎమోషనల్ కనెక్ట్ మిస్సయినట్లు అనిపించినా.. ప్రథమార్ధంలో ‘18 పేజెస్’ బోర్ అయితే కొట్టించదు. ద్వితీయార్ధంలో ప్రేమకథను ఇంకొంచెం గాఢతతో చూపించి ప్రేక్షకుల్లో ఫీల్ పెంచుతారని ఆశిస్తాం.
కానీ అసలు ఈ కథలో ఏమాత్రం సింక్ అవని క్రైమ్ ఎలిమెంట్ వచ్చి పడి ప్రేక్షకులను డిస్టర్బ్ చేస్తుంది. అప్పటిదాకా ఒక మంచి ప్రేమకథను చూస్తున్న భావనలోంచి.. వేరే మూడ్ లోకి వెళ్లిపోయేలా చేస్తుంది ఆ ఎలిమెంట్. పోనీ అదేమైనా బలంగా ఉందా అంటే అదీ లేదు. మినిమం ఇంట్రెస్ట్ కలిగించని ఈ ఎపిసోడ్ వల్ల ‘18 పేజెస్’ పక్కదారి పట్టేసింది. లవ్ స్టోరీ తాలూకు మూడ్ దెబ్బ తిన్నాక.. తిరిగి అందులోకి రావడం కష్టమే అవుతుంది. క్రైమ్ ఎపిసోడ్ ను ముగించాక మళ్లీ హీరోయిన్ యాంగిల్ నుంచి ప్రేమకథను నడిపించి.. హీరో పట్ల ఆమె ఆకర్షితురాలయ్యేలా చూపించారు. ఈ సన్నివేశాలు సోసోగా అనిపిస్తాయి. ముందు సన్నివేశాల్లో గాఢత ఉండుంటే క్లైమాక్స్ హృదయాలను హత్తుకునేది. కానీ అక్కడ పెద్దగా ఫీల్ లేదంటే అంతకుముందు జరిగిన డిస్టబెన్సే కారణం. ముగింపులో సుకుమార్ తన వ్యాఖ్యానంలో వాడిన ‘‘ఇంత గొప్ప ప్రేమ’’ అనే మాటకు న్యాయం చేయడంలో ‘18 పేజెస్’ విజయంతం కాలేదు. నిజానికి ఆ ఛాన్స్ ఉండి కూడా దాన్ని చెడగొట్టుకున్నట్లయింది. మంచి వంటకం తయారవుతుండగా.. దానికేదో మసాలా వేసి టేస్ట్ పెంచుదామని చూస్తే మొత్తం రుచి మారిపోయిన పరిస్థితి ‘18 పేజెస్’ది. టేస్టు ఓ మాదిరిగా ఉన్నా పర్వాలేదు ఏదోఒకటి తినాలనుకుంటే ‘18 పేజెస్’ ఓకే. కానీ అంతకుమించి ఆశిస్తేనే కష్టం.
నటీనటులు:
‘కార్తికేయ-2’లో చూసిన నిఖిల్-అనుపమ జంట ఇందులో కొత్తగా కనిపిస్తుంది. పాత్రలు.. నటన అన్నీ భిన్నంగా అనిపిస్తాయి. ఇప్పటి సగటు కుర్రాడి పాత్రలో నిఖిల్ సులువుగా ఒదిగిపోయాడు. మంచి హుషారుగా నటించి మెప్పించాడు. యూత్ అతడితో ఈజీగా కనెక్టవుతారు. అనుపమకు నందిని రూపంలో కెరీర్లో గుర్తుంచుకోదగ్గ పాత్ర దక్కింది. ఆధునికత అంటని సంప్రదాయ అమ్మాయిగా ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తక్కువ మేకప్ తోనే అందంగా కనిపించిన అనుపమ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. హీరో ఫ్రెండు పాత్రలో సరయు బాగా చేసింది. తన పంచులు నవ్విస్తాయి. అజయ్... దినేష్.. పోసాని.. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
ప్రేమకథలకు సంగీతం చాలా కీలకం. ‘నిన్నుకోరి’.. ‘మజిలీ’ సహా కొన్ని ప్రేమకథలకు ప్రాణం పోసిన గోపీసుందర్.. ‘18 పేజెస్’కు కూడా న్యాయం చేశాడు. పైన చెప్పుకున్న చిత్రాల్లో మాదిరి చార్ట్ బస్టర్ అనిపించే పాటలు లేకపోయినా.. ఈ కథకు అవసరమైన స్థాయిలో ‘ఏడు రంగుల వాన’.. ‘నన్నయ రాసిన..’ లాంటి ఫీల్ ఉన్న పాటలు ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా ఆహ్లాదకరంగా సాగింది. వసంత్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్-2 ప్రమాణాలకు తగ్గట్లే సాగాయి. సుకుమార్ అందించిన కథ కొంత ఆసక్తికరమే అయినా.. ఆయన స్థాయికి తగ్గట్లయితే లేదు. దానికి సూర్యప్రతాప్ చేసుకున్న స్క్రీన్ ప్లే సోసోగా అనిపిస్తుంది. ప్రేమకథను ఉన్నంతలో బాగానే నడిపించినా.. ఈ కథకు జోడించిన క్రైమ్ ఎలిమెంట్ విషయంలో ఇటు సుకుమార్.. అటు సూర్యప్రతాప్ తమ పనితనాన్ని చూపించలేకపోయారు. స్క్రిప్టులో బాగున్నదాన్ని ప్రతాప్ తెర మీద బాగా హ్యాండిల్ చేశాడు. అక్కడ వీక్ అయిన విషయాన్ని అతను కూడా మేకప్ చేయలేకపోయాడు.
చివరగా: 18 పేజెస్ .. ఒకసారి తిరగేయొచ్చు
రేటింగ్-2.75/5