పెద్ద సినిమాకి పెద్ద రేటు ముప్పే!

Update: 2022-09-03 14:33 GMT
పెద్ద సినిమాకి పెద్ద టిక్కెట్టు రేటు! అన్న చందంగా ఇటీవ‌లి కాలంలో రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉండ‌డంతో ఒక్కో సినిమాకి ఒక్కో రేటు ఫిక్స‌వుతోంది. కానీ పెద్ద రేటు ఎప్పుడూ పులి మీద స‌వారీ లాంటిది. అది ఎప్పుడు ఏ సినిమాని ఎలా మింగేస్తుందో చెప్ప‌లేం. మొన్న‌టికి మొన్న లైగ‌ర్ అనుభ‌వం అలాంటిదే. అంత‌కుముందు స‌రిలేరు నీకెవ్వ‌రు- ఆచార్య - వారియ‌ర్ లాంటి చిత్రాల‌కు స‌రైన వ‌సూళ్లు ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌ణం టికెట్ రేట్ల పెంపుద‌ల అన్న గుస‌గుస వినిపించింది.

ప‌రిమితిని దాటి టికెట్ ధ‌ర‌ల‌ను పెంచేస్తుండ‌డంతో ఆడియెన్ థియేట‌ర్ల‌కు రావాలా వ‌ద్దా? అన్న సందిగ్ధంలో ప‌డిపోతున్నారు. ఇప్పుడు మ‌ల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే ఐదుగురు ఉన్న ఫ్యామిలీకి మినిమం రూ.2000 పైగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అటుపై థియేట‌ర్ల‌లో తినుబండారాలు కూల్ డ్రింకుల పేరుతో చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది.

ఒక్కో టికెట్ ధ‌ర 300-400 మ‌ధ్య ఉండ‌డంతో కుటుంబ స‌మేతంగా సినిమాలు చూడ‌లేని స‌న్నివేశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా క‌రోనా క్రైసిస్ త‌ర్వాత మ‌ధ్యత‌ర‌గ‌తి వినోద‌పు ప్యాకేజీని త‌గ్గించేయ‌డంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చేవాళ్లు క‌రువ‌య్యారు. ఎక్కువ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే టెక్నిక్ ని అనుస‌రించ‌కుండా కేవ‌లం తొలి మూడు రోజుల వసూళ్ల‌ను మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ ధ‌ర‌ల్ని నిర్ణ‌యిస్తుండ‌డం షాకింగ్ రిజ‌ల్ట్ ని ఇస్తోంది.

టికెట్ ధ‌ర రూ.150- 200 వ‌ర‌కూ అయితే ఫ‌ర్వాలేదు కానీ అంత‌కుమించితే మ‌ధ్య‌త‌ర‌గ‌తి థియేట‌ర్ల‌కు రావ‌డం మానుకోవ‌డం ఖాయం. ఇక‌పోతే ఇప్పుడు  హిందీ సినిమా బ్రహ్మాస్త్ర కు హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రూ.325 రేటు పెట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.  

నెట్ బుకింగ్ ఛార్జీలు కూడా క‌లుపుకుని ఏకంగా రూ.360 చెల్లించాల్సి రావ‌డం షాకిస్తోంది. భారీ బ‌డ్జెట్ మూవీ పైగా 3డి సినిమా కాబ‌ట్టి ఇంత రేటు త‌ప్ప‌దు అనుకుంటే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాల్సిన స‌న్నివేశం ఉంది. ఇక క‌రోనా క్రైసిస్ త‌ర్వాత పెరిగిన ధ‌ర‌ల‌తో జ‌నం కునారిల్లుతుంటే వినోదానికి ప్ర‌జ‌లు బిగ్ బ‌డ్జెట్ పెట్ట‌డం ఎలా సాధ్యం? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

హిందీతో పాటు తెలుగు వెర్షన్ కు ఇంత పెద్ద రేటును పంపిణీదారులు ఫిక్స్ చేశాయి. అయితే తెలుగులో డ‌బ్బింగ్ సినిమాల‌కు మ‌రీ అంత గిరాకీ ఉండ‌దు. ర‌ణ‌బీర్ గ్రాఫిక‌ల్ మూవీకి అంత సీనుందా లేదా? అన్న‌ది రిలీజ్ డే తేలిపోతుంది. హిందీ బెల్ట్ లో ఉన్నంత బ‌జ్ తెలుగులో లేదు. మ‌ల్టీప్లెక్సుల వ‌ర‌కూ భారీ ధ‌ర‌లు చెల్లించేవారున్నా కానీ సింగిల్ స్క్రీన్ల‌కు రైజ్ ఎలా ఉంటుంది? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్ లో ఆలియా-ర‌ణ‌బీర్ బిజీ బిజీగా ఉన్నారు. ఎన్న‌డూ లేనిది ర‌ణ‌బీర్ .. ఆలియా ఇద్ద‌రూ హైద‌రాబాద్ ఈవెంట్లో తెలుగులో మాట్లాడేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్నారు. మొత్తానికి తెలుగు బెల్ట్ లో త‌మ మైలేజ్ పెంచుకునేందుకు ఈ జంట ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News