ఈమద్య కాలంలో టాలీవుడ్ కు చెందిన దాదాపు స్టార్ హీరోలందరు కూడా సొంత బ్యానర్ ను షురూ చేశారు... చేస్తున్నారు. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. రామ్ చరణ్.. బన్నీ.. ప్రభాస్ ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరోకు కూడా హోం బ్యానర్స్ ఉన్నాయి. ఆ బ్యానర్ లలో వారు సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఒక వేళ బయట బ్యానర్ ల్లో చేసినా కూడా తమ బ్యానర్ పేరును కూడా వేయిస్తున్నారు. ఇన్నాళ్లు ఎన్టీఆర్ కు మాత్రమే సొంత బ్యానర్ లేదనే టాక్ ఉండేది. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. ఎన్టీఆర్ సొంతంగా బ్యానర్ ను ఏర్పాటు చేయకుండా తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను తన హోం బ్యానర్ గా మార్చేసుకున్నాడు.
ఇప్పటికే జై లవకుశ సినిమా ను ఆ బ్యానర్ లో చేసిన ఎన్టీఆర్ ముందు ముందు చేయబోతున్న సినిమాలన్నింటికి కూడా ఆ బ్యానర్ ను సహ నిర్మాణ సంస్థగా చేర్చుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా నిర్మాణంలో భాగస్వామిగా నిలిచిన కళ్యాణ్ రామ్ బ్యానర్ త్వరలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ లతో నిర్మించబోతున్న సినిమాలో కూడా భాగస్వామిగా నిలువబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను ఎన్టీఆర్ హోం బ్యానర్ గా మార్చేసుకుని తన ప్రతి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నాడు.
ఇలా అన్న నిర్మాణ సంస్థను తన సినిమాల్లో భాగస్వామిగా చేసి వచ్చిన లాభాల్లో షేర్ ను అన్న కళ్యాణ్ రామ్ కు కూడా ఇవ్వబోతున్నాడు. ఒక్క ఇంట్లోనే రెండు మూడు బ్యానర్ లు ఉంటున్నాయి. కాని ఎన్టీఆర్ మాత్రం సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయకుండా తన అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ ను తన హోం బ్యానర్ గా మార్చేసుకున్నాడంటే వారిద్దరి మద్య ప్రస్తుతం ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ నందమూరి అన్నదమ్ముల కాంబో సినిమాలు అభిమానులకు మరింత కిక్ ఇస్తున్నాయి. ముందు ముందు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఎన్టీఆర్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.