తమిళనాట ఓ టీవీ నటి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో ఆత్మహత్య కేసుకున్న బుల్లితెర నటి చిత్ర కేసులో ట్విస్ట్ నెలకొంది. చిత్రది ఆత్మహత్య? హత్యనా అనే కోణంలో బోలెడు అనుమానాలు ఉన్నాయి.
చిత్ర భర్త, అత్త పోరుపడలేక ఆత్మహత్య చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. తాజాగా ఈ కేసులో కీలక ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టు సమాచారం. ఆమెది హత్య అని నిర్ధారించినట్టుగా ప్రచారం సాగుతోంది.
ఈ కేసు విషయమై విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. చిత్ర సెల్ ఫోన్ లో ముఖ్యమైన ఫొటోలు, కీలక ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. వీటిని మాయం చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇది హత్యనా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇది ఇంటిదొంగల పనియే అని.. వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
చిత్ర ఆత్మహత్యకు సెల్ లోని ఫొటోలు, వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్ మెసేజ్ లతో సంబంధం ఉండడం వల్లే ఆమె డేటా మాయం చేశారని అనుమానిస్తున్నారు.
సీరియల్ నటుడితో చిత్ర సన్నిహితంగా మెలగడాన్ని ఆమె భర్త హేమనాథ్ షూటింగ్ కు వచ్చి మరీ నిలదీసేవాడని.. ఒకసారి షూటింగ్ లోనే గొడవ పడ్డాడని సహనటులు పోలీసులకు చెప్పారు. దీన్ని బట్టి కుటుంబ సభ్యుల వల్లే చిత్ర సూసైడ్ చేసుకుందనే వాదన వినిపిస్తోంది.