ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త హేమంత్ కుమార్ ను తాజాగా అరెస్ట్ చేశారు. ఈనెల 9న చిత్ర చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో సూసైడ్ చేసుకుంది. పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్ లో ఆమె నటించారు.
వీజే చిత్ర ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉందని.. ఆమె బలవన్మరణానికి పాల్పడేలా ఆమె భర్త హేమంత్ కుమార్ వ్యవహరించినట్లు నజరత్ పేట పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీరియళ్లతో పాటు ఒకట్రెండు తమిళ సినిమాల్లో ఆమె అభ్యంతరకర సీన్లలో నటించడం పట్ల హేమంత్.. ఆగ్రహంతో, అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు.. ఆత్మహత్యకు పాల్పడిన రోజు.. వారిద్దరి మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుందని చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుదర్శన్ తాజాగా కేసు దర్యాప్తు అనంతరం తెలిపారు. ఈవీపీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ను ముగించుకుని హోటల్‌కు చేరుకున్న అనంతరం ఆమె తన చివరి ఫోన్‌కాల్‌ను హేమంత్‌కు చేశారని వివరించారు.
చిత్ర ఆత్మహత్య కేసులో ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవని తేల్చారు. ఆమె వ్యక్తిగత కుటుంబ సబంధాలే సూసైడ్ కు కారణమని పోలీసులు తేల్చారు. కొంతకాలంగా భర్తతో విభేదాలే ఆమె చావుకు కారణమని నిర్ధారించారు. రెండుసార్లు పోలీసులు ఆమె భర్తను విచారించగా ఈ విషయం బయటపడింది.
భర్త హేమంత్ ఒత్తిడి మానసికక్షోభ వల్లే చిత్ర సూసైడ్ చేసుకుందని నిర్ధారించామని ఏసీపీ తెలిపారు. ఈ కారణంగానే ఆమె భర్తను అరెస్ట్ చేశామని తెలిపారు.
టీవీ చానెళ్లలో ప్రజెంటర్ గా మొదలైన చిత్ర కెరీర్ తరువాత చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం యాంకరింగ్ తోపాటు పలు టీవీ సీరియళ్లలో నటిస్తోంది.