తమిళ హీరోల ను చూసి మన హీరోలు నేర్చుకోవాలా?

Update: 2019-11-13 01:30 GMT
ఈ మధ్య మన స్టార్ హీరోల కు ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది. వీలైనంత వరకూ ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.  అయితే అన్నీ కథల కు.. అన్ని సినిమాలకు ప్యాన్ ఇండియా అప్పీల్ ఉండదు అనే లాజిక్ ను పట్టించుకోవడం లేదు.  కుదిరితే ప్రతి సినిమా ను ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి.

అయితే కొందరు మాత్రం పస లేని సబ్జెక్టుల తో.. ఓవర్ బడ్జెట్ల తో ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తూ నష్టాల బారిన పడుతున్నారు. తాము తీసే ప్రతి సినిమా ను రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' లాగా అనుకుంటూ బోల్తా కొడుతున్నారు.  అయితే ప్రతి సినిమా కు ప్యాన్ ఇండియా అప్పీల్ రాదు.. ప్రతి దర్శకుడు రాజమౌళి కాదనే మౌలికమైన విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. అయితే  ఈ విషయం లో తమిళ స్టార్ హీరోలు కొంచెం జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

తమిళ స్టార్ హీరోల ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ పాకు లాడకుండా ఒక పద్దతి ప్రకారం మార్కెట్ ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  మొదట సౌత్ పై దృష్టి సారించి ఫ్యాన్ బేస్ పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆ తర్వాతే హిందీ..  ఆ తర్వాత సౌత్ ఏషియా.. ఆ తర్వాత ఇతర దేశాల్లో తమ సినిమాల రిలీజులతో ఫ్యాన్స్ ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  నిజానికి తమిళ రజనీకాంత్.. కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్లు తమ మార్కెట్ ను ఇలా పెంచుకుంటూ వచ్చినవారే.

ఈ జెనరేషన్ తమిళ స్టార్లు కూడా అదే రకమైన ఎప్రోచ్ లో ఉన్నారు.  ఉదాహరణ కు ధనుష్ ను తీసుకుంటే ప్రతి సినిమా ను ప్యాన్ ఇండియా అని హంగామా చేయడు. అలా అని ఒక్క భాషను వదలి పెట్టకుండా మార్కెట్ సాధించాడు.  తెలుగు లో ధనుష్ సినిమాలు రిలీజ్ అవుతాయి. అవకాశం వచ్చినప్పుడు స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో నటించాడు.  చివరికి హాలీవుడ్ సినిమా లో కూడా నటించాడు.  ఇప్పుడు ధనుష్ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. అయినా 'అసురన్' సినిమాను ప్యాన్ ఇండియా రిలీజ్ చెయ్యలేదు. ఎందుకంటే అది నేటివిటీ ఫిలిం. అందుకే తమిళ భాష కు మాత్రమే పరిమితం చేసి పరిణతి చూపించాడు.  

మన హీరోలు కూడా ఒక ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ కుదిరిన సమయం లో.. దానికి తగిన ప్రతిభావంతుడైన దర్శకుడు సెట్ అయినప్పుడే ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేయాలని లేక పోతే  ప్రతి సారి బోల్తా కొట్టడం కామన్ గా మారుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
Tags:    

Similar News