సిల్క్ స్మిత ఇమేజ్ ని వాడేస్తోన్న నేచుర‌ల్ స్టార్!

Update: 2022-12-04 03:30 GMT
ఒక‌ప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేసినా సిల్క్ స్మిత క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ స్టార్ హీరోయిన్ మించిన క్రేజ్ ని ఓ న‌ర్త‌కి ద‌క్కించుకోవ‌డం అదే తొలిసారి...చివ‌రి సారి కూడా. సిల్క్ స్మిత‌కంటే ముందు..త‌ర్వాత‌ ఎంతో మంది డాన్స‌ర్లు వ‌చ్చారు. వెళ్లారు. కానీ సిల్స్ స్మిత అయినంత ఫేమ‌స్ ఎవ‌రూ కాలేక‌పోయారు. ఇప్ప‌టికీ అదే ఇమేజ్ తో సిల్క్  స్మిత్ బ్రాండ్ ఇమేజ్ ని ఎన్ క్యాష్  చేసుకుంటున్నారు.

అప్ప‌ట్లో బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన  `డ‌ర్టీ పిక్చ‌ర్` ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు.  విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈసినిమా బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది.   అలాగే మ‌ల‌యాళంలో స‌నాఖాన్ కూడా సిల్క్ స్మిత పాత్ర‌తో ఓ సినిమా చేసారు. కానీ అది పెద్ద‌గా ఆడ‌లేదు.

క‌న్న‌డ‌లో  పాకిస్తాన్ న‌టి వీణామాలిక్  కూడా  సిల్క్ పాత్ర‌తో అక్క‌డో ప్ర‌యోగం చేసారు. అదీ పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. కానీ సిల్క్ ఇమేజ్ తో నిర్మాత‌లైతే న‌ష్ట‌పోలేదు.  కోలీవుడ్ లోనూ  `అవళ్‌ అప్పడిదాన్‌` (ఆమె అంతే) అనే టైటిల్ తో మ‌రో సినిమా చేసారు.  కేఎస్ మ‌ణికంద‌న్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా బాగానే ఆడింది. ఇలా సిల్క్ ఇమేజ్ని చాలా మంది ద‌ర్శ‌కులు ఎన్ క్యాష్ చేసుకున్నారు.

ఆమె చ‌నిపోయి రెండు ద‌శాబ్ధాలు దాటినా ఇప్ప‌టికీ అదే క్రేజ్ తో ఆమె సినిమాలు ఆడుతున్నాయంటే? ఎంత ఫేమ‌స్ అయ్యార‌న్న‌ది మ‌రోసారి అద్దం ప‌డుతుంది. తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న `ద‌స‌రా` సినిమాలోనూ సిల్క్ స్మిత ఇమేజ్ వాడుకుంటున్న‌ట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో నాని సిల్క్ స్మిత  అభిమాని పాత్ర‌లో కనిపించ‌నున్నాడు.

తాజాగా `ద‌స‌రా`  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్యాగ్రౌండ్‌లో సిల్క్ స్మిత ఫోటోనే హైలైట్ చేసారు. అలాగే ధూమ్ ధామ్ దోస్తానా పాటలోనూ సిల్క్ స్మితను బాగానే చూపించారు మేకర్స్. డిసెంబర్ 2న ఆమె జయంతి సందర్భంగా పోస్టర్ విడుదల చేసి సిల్క్ స్మిత‌ని అభిమానులుకు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఇన్నేళ్ళ తర్వాత కూడా సిల్క్ స్మిత ట్రెండింగ్‌లో ఉండ‌టం విశేష‌మ‌నే చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News