యంగ్ హీరోకి కలిసి రావడం లేదేంటో !

Update: 2019-09-06 15:35 GMT
టాలీవుడ్ లో కొందరు యంగ్ హీరోలు వరుస అపజయాలతో కెరీర్ ని డౌన్ చేసుకుంటున్నారు. ఆ లిస్టులో యంగ్ హీరో ఆది సాయి కుమార్ కూడా ఉన్నాడు. 'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా పరిచయమై తొలి హిట్ అందుకున్న ఆది ఆ తర్వాత  'లవ్లీ' తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే అక్కడి ఈ కుర్ర హీరోను వరుస అపజయాలు పలకరించాయి. నెక్స్ట్ నువ్వే అంటూ ఓ రీమేక్ సినిమాను నమ్ముకున్నా లాభం లేకపోయింది.

ఇక ఈ మధ్య 'బుర్ర కథ' అంటూ ఓ ప్రయోగం కూడా చేసాడు. రిలీజ్ కి ముందు కొంత హైప్ తెచ్చుకున్నా... ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  చేసిన పదమూడు సినిమాల్లో తొమ్మిది ఫ్లాపులే.. రెండు మాత్రమే హిట్లు. ఇప్పుడు 'జోడి'తో మరోసారి నిరుత్సాహ పరిచాడు ఆది. ఈ సినిమా మొదటి షో కే రొటీన్ కంటెంట్ అంటూ టాక్ వచ్చేసింది. దీంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డాడు ఆది.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆశలన్నీ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' సినిమా మీదే ఉన్నాయి. 'వినాయకుడు' ఫేం సాయి కుమార్ అడివి తెరకెక్కించిన ఈ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ఆది. ఈ సినిమా కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి ఈ సినిమా అయినా ఆదికి హిట్ అందిస్తుందా చూడాలి.


Tags:    

Similar News