హిట్టు పడాలి. అర్జెంటుగా పెద్ద హీరో అవ్వాలి. తనకంటూ డిపెండబుల్ మార్కెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇదే కుర్రాడు ఆది తాపత్రయం. సాయికుమార్ కొడుకుగా ఎన్నాళ్ళని ఇంకా అదే గొడుగులో ఉంటాడు. అందుకే మళ్లీ మళ్ళీ కమర్షియల్ సినిమాలతోనే తెగ ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పుడు కొత్తగా 'గరం' అంటూ వచ్చేశాడు ఈ కుర్రాడు. రైటర్ డైరక్టర్ మదన్ (పెళ్లయిన కొత్తలో ఫేం) డైరక్షన్ లో ఇప్పుడు ఈ సినిమాతో ఆది ఏం చేయనున్నాడట? ఈ సినిమాలో మనోడు ఓ కాలేజ్ గోయింగ్ యూత్. ఇందులో ఒక ముస్లిం యువతి క్యారెక్టర్ లో హీరోయిన్ అదా శర్మ నటిస్తోంది. ఈ జంట ప్రేమకథే సినిమా. వీరి మధ్య జరిగే రొమన్స్.. అక్కడి నుండి విలన్ల ఎంట్రీ.. ఫైటింగులూ.. హీరోగిరీ.. కత్తిలాంటి అందాల ఆరబోతతో అదా శర్మతో కలసి స్టెప్పులు వేయడం.. అబ్బో చాలానే ఉన్నాయ్. ఇకపోతే శకలక శంకర్ చేసే కామెడీ కూడా బాగానే ఉంది.
మొత్తంగా చూసుకుంటే గరం లో మసాలా ఓ రేంజులో దంచేశారు. మరి ఈ మసాలా అంతా ఏ మేరకు ఆదిని పెద్ద స్టార్ చేస్తుందో చూడాలి.