పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ మూవీలో విలన్ గా నటించిన అభిమన్యు సింగ్.. అంతకు ముందు ఆ తరువాత కూడా పలు టాలీవుడ్ చిత్రాలలో కనిపించాడు. పాట్నాకు చెందిన నటుడు అయినా.. దేశవ్యాప్తంగా అనేక ఇండస్ట్రీలలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అభిమన్యు సింగ్.. ఒకే రోజు తను నటించిన రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండడంపై తెగ ఆనందంగా ఉన్నాడు.
పన్నా రాయల్.. పూర్ణలు నటించిన రాక్షసి చిత్రంలో అభిమన్యు సింగ్ ఓ పాజిటివ్ రోల్ కనిపించనున్నాడు. హీరో జీవితం నుంచి చెడును తరిమేసే పాత్రలో నటించాడు. పెద్దగా ప్రీ రిలీజ్ బజ్ సృష్టించలేకపోయిన రాక్షసి.. ఇవాళే రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో తన పాత్రకు మంచి పేరు వస్తుందని అంటున్నాడు అభిమన్యు సింగ్. అలాగే ఈయన నటించిన హిందీ మూవీ మామ్ రిలీజ్ కూడా ఇవాళే. ఇది తెలుగులో కూడా డబ్బింగ్ అయి విడుదల అవుతుండడంతో.. ఒకే రోజు రెండు సినిమాలు వస్తున్న ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు చెబుతున్నాడు అభిమన్యు సింగ్.
తను ఓ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో.. ఇంకా ఎంతో నటించాల్సి ఉందని భావిస్తున్నట్లు చెప్పిన అభిమన్యు.. తన ట్యాలెంట్ ఇంకా పూర్తిగా చూపించలేదని అంటున్నాడు. అందుకే ఈ మధ్య పాజిటివ్ రోల్స్ ఎంచుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఇన్నేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నా.. ఇంకా తెలుగు పూర్తిగా నేర్చుకోలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాడట. త్వరలో తనను పూర్తి స్థాయి తెలుగు నటుడిగా మార్చుకుంటానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అభిమన్యు సింగ్.