మహమ్మారీ భయాందోళనలు ఇంకా ఇండస్ట్రీని విడిచిపెట్టలేదు. ఇటీవలే ఎస్.ఎస్.రాజమౌళి సహా పలువురు టాప్ సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ రావడం అనంతరం చికిత్స ద్వారా కోలుకోవడం తెలిసినదే. వైరస్ ఎవరినీ వదిలి పెట్టదన్న ఆందోళన అలానే ఉండిపోయింది. ఇక ఏజ్ దృష్ట్యా కూడా పలువురు స్టార్ హీరోల్ని ఆందోళన విడిచిపెట్టడం లేదు. 60 ప్లస్ లో ఇప్పుడున్న పరిస్థితిలో రిస్క్ చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే నెమ్మదిగా షూటింగుల విషయమై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (65) సైతం మహమ్మారీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పూర్తి చేసి కొరటాల ఎంతో ఉత్సాహంగా ఉన్నా ఇంకా వేచి చూసే ధోరణినే అనుసరిస్తున్నారు. ఇక ఎంతో ఓపిగ్గా కొరటాల కూడా అందుకు సహకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. తొలుత టెస్ట్ షూట్ చేశాకే చిరుని సెట్స్ కి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారట. అలాగే చిరు-చరణ్ కాంబినేషన్ చిత్రీకరణలకు సంబంధించిన ప్రత్యేకించి కేర్ తీసుకోనున్నారని తెలిసింది.
ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ కోసం రాజమౌళి సైతం ఇలానే టెస్ట్ షూట్లు చేశారు. ఆ తర్వాత మొన్ననే షూటింగును కూడా ప్రారంభించారు. ఇప్పుడు అదే బాటలో కొరటాల అండ్ టీమ్ కూడా కేర్ తీసుకుంటున్నారు. దర్శకుడు కొరటాల శివ ఒక ప్రైవేట్ స్టూడియోలో టెస్ట్ షూట్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతా సాధారణం అయ్యి బాగుంటే చిరంజీవి నవంబర్ నుండి సెట్స్ లో చేరనున్నారు. కుదరకపోతే షూట్ మరింత ఆలస్యమవుతుందట. అందాల కాజల్ అక్టోబర్ 30 న వివాహం చేసుకోనున్న సంగతి విధితమే. తను నవంబర్ చివరి వారం నుండి కాల్షీట్లను కేటాయించింది. దసరా తరువాత టెస్ట్ షూట్ ప్రారంభించి ఒక వారం పాటు కొనసాగిస్తారట. అనంతరం చిరంజీవి కూడా సెట్స్ లో జాయిన్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.