బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అక్షయ్ కుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అక్షయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా స్కూల్ పిల్లల యొక్క సిలబస్ లో ఎక్కడ కూడా హిందూ రాజుల యొక్క ప్రస్తావన లేదు. ఇదే విషయాన్ని ఆయన లేవనెత్తాడు. ముస్లిం రాజుల గురించి పుస్తకాలకు పుస్తకాలు ఉన్నా హిందూ రాజుల గురించి ఎందుకు మన పుస్తకాల్లో లేదు అంటూ ఆయన ప్రశ్నించాడు. భారతీయులు పూర్వపు హిందూ రాజుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటూ అక్షయ్ కుమార్ ప్రశ్నించాడు.
చరిత్ర లో మొగలుల గురించి ఉండటంను ఎవరు తప్పు పట్టడం లేదు. అదే సమయంలో హిందువుల గురించి.. హిందూ రాజుల గురించి వారి చరిత్ర గురించి కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా అంటూ అక్షయ్ కుమార్ ప్రశ్నించాడు. మొగల్స్ పాలకుల పాఠాలతో పాటు హిందూ రాజుల పాఠాలను కూడా సమతూకంతో పుస్తకాల్లో ఉంచాలంటూ అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు.
ఇన్నాళ్లు చాలా మందిలో కూడా హిందూ రాజుల గురించి పాఠ్య పుస్తకాల్లో లేక పోవడంపై అసంతృప్తి ఉంది. ఇప్పుడు అది అక్షయ్ కుమార్ వ్యాఖ్యలతో తారా స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు ఈ సమయంలో దేశంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు.. తన సినిమా ప్రమోషన్ కోసం శాంతి భద్రతల విషయం ను ఆయన పట్టించుకోకుండా వదిలేశాడు అంటూ విమర్శలు చేసే వారు ఉన్నారు.
మొత్తానికి దేశంలోని చాలా సున్నితమైన అతి పెద్ద ఇష్యూను అక్షయ్ కుమార్ తట్టి లేపాడు. ఆయన ఈ విషయంను పృథ్వీరాజ్ విడుదల అయిన తర్వాత మర్చిపోయిన కూడా జనాలు మాత్రం మర్చి పోయే పరిస్థితి కనపడటం లేదు. తప్పకుండా ఈ ఇష్యూ మీద హిందూ సంఘాల వారు ఆందోళనలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.