దుల్కర్ సల్మాన్ .. మలయాళ స్టార్ హీరో. అక్కడ తిరుగులేని కథానాయకుడైన మమ్ముట్టికి వారసుడు. పదేళ్లలో ఆయన 35 సినిమాలను పూర్తి చేయడం విశేషం. తాజాగా వచ్చిన 'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను స్టార్ హీరో వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మాట నిజమే. కానీ వారసుడిని కాబట్టి ఇంతదూరం రాలేదు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోల కంటే ఎక్కువ గానే కష్టపడ్డాను. నాన్న పేరు నిలబెట్టాలనే ఒక ఆలోచన మరింత కష్టపడేలా చేసింది.
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పటిలా కారవాన్ వసతులు లేవు. అవుట్ డోర్ కి వెళ్లినప్పుడు నాలుగు లుంగీలు నాలుగు వైపులా తెరల మాదిరిగా పట్టుకుంటే అదే ఒక రూమ్ అనుకోవాలి .. డ్రెస్ ఛేంజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కారవాన్ లలో కూడా అద్భుతమైన టెక్నాలజీ ఆశ్చర్యపరుస్తోంది. మా నాన్నకి యాక్షన్ హీరోగా ఇమేజ్ ఉంది .. నాకు లవర్ బాయ్ గా ముద్రపడింది. మా నాన్న రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్లడం వలన నాకంటూ ఒక సొంత గుర్తింపు వచ్చింది. అప్పట్లో నాన్న వరుస సినిమాలు చేసేవారు .. షూటింగు గ్యాపులో మాత్రమే కునుకు తీసేవారు. కానీ ఇప్పుడు అలా వరుస సినిమాలు చేసే పరిస్థితి లేదు.
ఎవరైనా సరే .. 'ఇలా చేయడం నీ వల్ల కాదు' .. అంటే ఆ పని పూర్తిచేసేవరకూ నాన్న నిద్రపోయేవారు కాదు. ఆయన నుంచి నేను నేర్చుకున్నది కూడా అదే. ఆ పద్ధతి వల్లనే ఇక్కడి వరకూ వచ్చానని నేను అనుకుంటున్నాను. నాన్నకీ .. మోహన్ లాల్ అంకుల్ కి మధ్య గట్టి పోటీ ఉందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఏదైనా సినిమాలో నేను బాగా చేసినప్పుడు మోహన్ లాల్ అంకుల్ చాలా గర్వంగా అందరితో చెబుతుంటారు. అంకుల్ పిల్లలంతా నన్ను 'పెద్దన్నయ్య'గానే భావిస్తారు.
వృత్తిని .. వ్యక్తిగత జీవితాన్ని వేరు చేసి చూసే పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఇంటి విషయాలు సెట్ వరకూ .. షూటింగులోని సీన్స్ ప్రభావం ఇంటివరకూ వస్తుంటాయి. ఒకప్పుడు ఒక భాషలోని ఒక ఆర్టిస్ట్ ఇతర భాషల వారికి తెలియాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఓటీటీల కారణంగా ఇతర భాషలకి సంబంధించిన సినిమాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఆర్టిస్టులకి చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు వస్తోంది. ప్రస్తుతం నా కెరియర్ సంతృప్తికరంగానే ఉంది .. కానీ సాధించవలసింది చాలానే ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.