ప్రముఖ తమిళ నటుడు రాజ్ కిరణ్ తెలియనివారు లేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చ సినిమాలో చరణ్ తండ్రిగానూ, విశాల్ హీరోగా వచ్చిన పందెంకోడి సినిమాలో విశాల్ తండ్రిగా నటించి మంచి ప్రతిభ కనబర్చారు.. రాజ్ కిరణ్. ఇప్పుడు ఈ నటుడు వార్తల్లోకెక్కారు.
తాజాగా రాజ్ కిరణ్ కుమార్తె ప్రియ ఇంట్లో నుంచి వెళ్లిపోయి టీవీ నటుడు మునీష్ రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే ఉంది.
మునీష్ రాజ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది తన కుమార్తె ప్రియ కాదని అంటున్నాడు.. రాజ్ కిరణ్. ఇందుకు సంబంధించి ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటన ప్రకారం.. తన కూతురు ఒక టీవీ నటుడిని పెళ్లి చేసుకుందనే తప్పుడు ప్రచారం తన దృష్టికి వచ్చిందని రాజ్ కిరణ్ పేర్కొన్నారు. అందుకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నానని తెలిపారు. తనకు టిప్పుసుల్తాన్ అనే ఒక కొడుకు మాత్రమే ఉన్నాడన్నారు. కుమార్తె లేదన్నారు. అయితే తాను హిందూ మతానికి చెందిన ప్రియ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆమె తన దత్తత కూతురనే విషయం ఆమెకు కూడా ఎప్పుడూ చెప్పలేదన్నారు. దత్తత కూతురు అని చెప్తే ప్రియ బాధపడుతుందని, అందుకే నువ్వు నా దత్తత కూతురిని అని చెప్పలేదని తెలిపారు. మొదటి నుంచి ప్రియను సొంత కూతురుగానే పెంచానన్నారు.
ఈ క్రమంలో టీవీ నటుడు మునీష్ రాజ్ ఫేస్‌బుక్ ద్వారా ప్రియతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పాడని మండిపడ్డారు. తన పేరును వాడుకుని సినిమా అవకాశాలు పొందడంతోపాటు తన డబ్బును కాజేయాలని ప్రియను అతడి వల్లో వేసుకున్నాడని నిప్పులు చెరిగారు. ఈ విషయం తనకు తెలియడంతో మునీష్ రాజ్ గురించి ఆరా తీశానని వెల్లడించారు. తన విచారణలో మునీష్ రాజ్ చాలా మోసగాడని, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని తెలిసిందని చెప్పారు.
మునీష్ రాజ్ కు కావాల్సింది ప్రియను పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపడం కాదన్నారు. తన పేరు వాడుకుని సినీ అవకాశాలను పొందాలని, తన నుంచి డబ్బులు కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచనలతోనే ప్రియను ప్రేమించాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రియకు వివరించామని.. మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తామన్నారు. ప్రియ కూడా ఈ విషయంలో తాము చెప్పినదానికి అంగీకరించిందన్నారు.
ఈ క్రమంలో కొద్ది రోజులు గడిచాక తన భార్య స్నేహితురాలు పార్వతి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిందన్నారు. నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు. ఇప్పుడు ఆ మునీష్ రాజ్ ను పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం తన భార్యనేనని ఆ అమ్మాయి నిందలు వేస్తోందని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని రాజ్‌కిరణ్ తెలిపారు. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలనే ప్రకటన విడుదల చేస్తున్నానన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.