నచ్చిన చిన్నదాన్ని కట్టుకున్నాడు. ఏడాది తిరగకుండానే పండంటి బిడ్డను కన్నాడు సదరు టాప్ కమెడియన్. ఇంతకీ ఎవరు.. అంటే.. కోలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు కం కమెడియన్ యోగి బాబు గురించే ఇదంతా. 2020 ఫిబ్రవరిలో మంజు భార్గవిని యోగిబాబు వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని తిరుట్టానిలోని మురుగన్ ఆలయంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఈ వివాహం జరిగింది.
వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుక గా సాగింది. అనంతరం పరిశ్రమకు చెందిన వారి స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. అయితే ఇది కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా రద్దయింది.
తాజాగా ఒక పండంటి అబ్బాయికి ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. నటుడు కం దర్శకుడు మనో బాలా తమ ట్విట్టర్ పేజీలో నవజాత శిశువు జననంపై వార్తను అధికారికంగా ధృవీకరిస్తూ యోగి బాబును అభినందించారు. యోగి బాబు అభిమానులు సహా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి యోగిబాబుకు విషెస్ అందుతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ .. అజిత్.. సూర్య .. నయనతార సహా దక్షిణాదిలోని చాలామంది స్టార్ మీరోల సినిమాల్లో కమెడియన్ గా నటించారు. దర్బార్ చిత్రంలో రజనీకాంత్ సైడ్ కిక్ గా ఆయన చివరిసారిగా పెద్ద తెరపై కనిపించారు.
ధనుష్ - కర్ణణ్ .. అజిత్- వాలిమై చిత్రాల్లోనూ ప్రస్తుతం యోగిబాబు నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న కర్ణన్ షూటింగ్ ను ఇప్పటికే ముగించారు. తళా అజిత్ `వాలిమై`లో కూడా యోగి బాబుకు కీలక పాత్రలో నటిస్తున్నారు. శివకార్తికేయన్ - డాక్టర్ సహా డిక్కిలూనా- కడైసీ వివాసాయి- పీ మామా -సెలూన్ వంటి చిత్రాల్లోనూ యోగిబాబు నటిస్తున్నారు. తమిళంలోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా బిజీ స్టార్ గా యోగిబాబు కొనసాగుతున్నారు.