చిత్ర లేదు.. కానీ ఆమె నటించిన సినిమా రిలీజ్ కు రెడీ

Update: 2020-12-16 06:49 GMT
తమిళనాట ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి విజే చిత్ర నటించిన తొలి సినిమా ‘కాల్స్’ విడుదలకు సిద్ధమైంది. కానీ ఈ విడుదల వేళ ఆమె లేకపోవడం చిత్ర బృందానికి విషాదంగా మారింది. బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ అందరి మనసులు గెలుచుకున్న చిత్ర నటించిన తొలి సినిమా ‘కాల్స్’ కావడం విశేషం. ఇదే ఆమె చివరి చిత్రంగా మిగిలిపోవడం విషాదం నింపింది.

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆమె భర్త హేమంత్ కుమార్ ను తాజాగా అరెస్ట్ చేశారు. ఈనెల 9న చిత్ర చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో సూసైడ్ చేసుకుంది. పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్ లో ఆమె నటించారు.

చిత్ర ఆత్మహత్య కేసులో ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవని తేల్చారు. ఆమె వ్యక్తిగత కుటుంబ సబంధాలే సూసైడ్ కు కారణమని పోలీసులు తేల్చారు. కొంతకాలంగా భర్తతో విభేదాలే ఆమె చావుకు కారణమని నిర్ధారించారు. రెండుసార్లు పోలీసులు ఆమె భర్తను విచారించగా ఈ విషయం బయటపడింది.

ఎన్నో ఆశలతో చిత్ర సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. అయితే దురదృష్టవశాత్తూ తన తొలి సినిమా చూడకుండా ఆత్మహత్య చేసుకుంది.

2019 జూలైలో చిత్ర హీరోయిన్ గా ‘కాల్స్’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. శబరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జయకుమార్, కావేరి సెల్వి నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలోనే పూర్తి కావడంతో అన్ని కార్యక్రమాలు జూలైలో పూర్తి చేసి విడుదలకు రిలీజ్ చేయగా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
Tags:    

Similar News