కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తల్లి కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆమెకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అందులో ప్రియాంక చోప్రా పొట్ట కాస్త పెద్దగా ఉండటంతో అంతా కూడా ఆమె తల్లి కాబోతుందని భావించారు. పెళ్లి అయ్యి ఆరు నెలలు కూడా కాకుండానే అప్పుడే పిల్లలు ఏంటీ, ప్రియాంక చోప్రా తల్లి కాబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె తల్లి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇదే ప్రశ్న మరో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎదుర్కొంది.
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకొనేల వివాహం అయిన విషయం తెల్సిందే. ఇద్దరి వివాహం తర్వాత అన్యోన్యంగా కనిపించారు. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో దీపిక పదుకొనే పాల్గొన్న సమయంలో మీడియా వారితో ముచ్చటించింది. ఈ సందర్బంగా మీడియా నుండి మీరు గర్బవతా అంటూ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు ఆమె చిరాకు పడింది. మీడియా వారిపై మండి పడింది. పెళ్లి అయిన వారు వెంటనే తల్లి కావాల్సిందేనా, ప్రతి ఒక్క పెళ్లి అయిన సెలబ్రెటీని ఎందుకు ఇలాంటి ప్రశ్నలతో విసిగిస్తున్నారు, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది, అప్పుడే మీకు తెలుస్తుంది. పదే పదే ఆ విషయమై మీరు ప్రశ్నించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ సీరియస్ అయ్యింది. సెలబ్రెటీలు పెళ్లి అయిన కొన్ని నెలల నుండే సహజంగా ఇలాంటి వార్తలను, పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఆ వార్తలు చిరాకును కలిగిస్తాయి. దీపిక కూడా అదే చిరాకును ఎదుర్కొంటోంది.