సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని స్టార్ కిడ్స్ పై నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని తండ్రుల అండదండలతో ఇండస్ట్రీలో ఎదిగిన వారు దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కరణ్ జోహార్ సల్మాన్ వంటి స్టార్స్ తో పాటు హీరోయిన్స్ కూడా ఈ ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్బంగా సోనమ్ కపూర్ తన తండ్రి వల్లే నా ఈ స్థాయి అంటూ నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
నీ తండ్రి లేకుంటే నీవు కనీసం సహయ నటిగా కూడా ఛాన్స్ దక్కించుకునే దానివి కాదని.. నీకంటూ గుర్తింపు లేదు అది నీ తండ్రి వల్లే వచ్చింది అంటూ నెటిజన్స్ తీవ్ర స్థాయిలో సోనమ్ ట్విట్ కు కామెంట్స్ చేశారు. నెటిజన్స్ కామెంట్స్ తో తీవ్ర ఒత్తిడికి గురైన సోనమ్ కపూర్ చివరకు తన ట్విట్టర్ అకౌంట్ లో కామెంట్స్ చేసే ఆప్షన్ ను డి యాక్టివేట్ చేసింది. ఇకపై ఎవరు కూడా ఆమె చేసిన ట్వీట్స్ కు కామెంట్స్ చేయలేరు.
ఇంతకు ముందే సోనాక్షి సిన్హా సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లుగా ప్రకటించింది. ఆమె ట్రోల్స్ ను తట్టుకోలేకనే మొత్తం అకౌంట్ ను డి యాక్టివేట్ చేసింది. ఇప్పుడు సోనమ్ తన అకౌంట్ కామెంట్స్ ను డియాక్టివేట్ చేసింది. ఇక ఆలియాతో పాటు పలువురు స్టార్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. వారిని కూడా సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసే వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా మెల్లగా సోషల్ మీడియాను వదిలేస్తారేమో అంటున్నారు.