దావూద్ ఇబ్ర‌హీంతో లింకులున్న ప్ర‌ముఖ‌ న‌టి?

Update: 2023-04-11 09:25 GMT
మరాఠీ సినీ నటి- రాజకీయ నాయకురాలు దీపాలీ సయ్యద్ తనను చంపేస్తానని బెదిరించాడంటూ తన మాజీ వ్యక్తిగత సహాయకుడు బాబూరావు షిండేపై ఫిర్యాదు చేసింది.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తాను పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నానని దుబాయ్ - పాకిస్తాన్ లోని అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని షిండే తనపై దుమ్మెత్తి పోశాడని కూడా నటి తన ఫిర్యాదులో పేర్కొంది.

అతను నా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి దావూద్ ఇబ్రహీంతో నాకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు అని నటి తెలిపింది. దీపాలీ సయ్యద్ 'బందానీ'-సమంతర్ వంటి మరాఠీ సీరియల్స్ లో నటించారు. ఆమె 30 కంటే ఎక్కువ మరాఠీ చిత్రాలలో కనిపించింది. ప్రస్తుతం శివసేన సభ్యురాలు.

90ల‌లో ముంబై సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించితన అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఇంకా బ‌తికే ఉన్నాడా? అంటే అత‌డు ఇప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. దావూద్ మ‌ర‌ణించాడ‌ని ప్ర‌చార‌మైనా కానీ దానికి సంబంధించిన ఆధారాలేవీ బ‌య‌ట‌ప‌డలేదు.

దీంతో అత‌డు ఇంకా మ‌నుగ‌డ సాగిస్తున్నాడ‌ని భావించేవాళ్లు ఉన్నారు. దావూద్ త‌ల‌పై 25 మిలియ‌న్ డాల‌ర్ల బ‌హుమ‌తిని కూడా భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ అత‌డి జాడ అయినా దొర‌క‌లేదు. కానీ అత‌డి కీల‌క అనుచ‌రులు ఇప్ప‌టికీ ముంబై నేర ప్ర‌పంచంతో సంబంధాలు కొన‌సాగిస్తున్నార‌ని సినీప‌రిశ్ర‌మ లింకుల‌ను క‌లిగి ఉన్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Similar News