చేయి పట్టుకుని నడిపించే తోడు కావాలి: రేణూ దేశాయ్

Update: 2022-09-05 12:30 GMT
తెలుగు ప్రేక్షకులకు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా దర్శకురాలిగా మల్టీటాలెంటెడ్ అనిపించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణు.. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది.

పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటుగా ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్యల గురించిన వివరాలు వెల్లడిస్తుంది రేణూ. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో కలిసి స్కాట్లాండ్ లో ఉంది. అయితే రేణూ దేశాయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన రీల్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

'జీవితంలో మనకు అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు అవసరం' అని పేర్కొంటూ రేణూ ఓ రీల్ ని ఇన్స్టా లో షేర్ చేసింది. అనంతరం మరో వీడియోలో 'మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి' అని పేర్కొంది.

అయితే రేణు దేశాయ్ చేసిన పోస్ట్ లకు ఆమె వ్యక్తిగత జీవితంతో లింక్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక తోడు అవసరం అని పేర్కొనడంతో.. ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుందేమో అని వ్యాఖ్యానిస్తున్నారు.

'బద్రి' సినిమాలో కలిసి నటించిన హీరో పవన్ కళ్యాణ్ ని ప్రేమించిన రేణూ.. కొన్నాళ్ల పాటు అతనితో సహజీవనం చేసింది. అకీరా నందన్ జన్మించిన తర్వాత 2009 లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. మూడేళ్ళ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2012లో విడాకులు తీసుకున్నారు.

విడాకులు తీసుకున్నప్పటి నుంచి రేణు దేశాయ్‌ సింగిల్ గా ఉంటోంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. గతంలో రేణు రెండో పెళ్లిపై అనేక చర్చలు జరిగాయి. 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ అభిమానులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు. కానీ రేణూ దేశాయ్ పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి జీవితంలో తోడు అవసరమని ఆమె పోస్టులు పెట్టడంతో.. రేణూ మరో తోడు కోరుకుంటుందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. రేణూ దేశాయ్ చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. అలానే 'ఆద్య' అనే లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్‌ తో ఓటీటీలో అడుగుపెట్టనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News