బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ (నటవారసుల) ఆదాయం చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. పాతిక ప్రాయంలో కుర్ర భామలు కోట్లాది రూపాయాలు కొల్లగొడుతున్నారు. సినిమా పారితోషికాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇంకా రిబ్బన్ కటింగ్ లు.. వ్యాపారాల్లో పెట్టుబడుల రూపంలో భారీగానే ఆర్జిస్తున్నారు. తండ్రులకు ఉన్న బ్రాండ్ వ్యాల్యూతో ఆరంగేట్రం చేసినా ఆ తర్వాత సత్తా చాటుతూ మార్కెట్ లో చెలామణీ అవుతూ ఆదాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఆ లిస్ట్ లో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. మహేష్ భట్ వరాసురాలు అలియా భట్.. అతిలోక సందరి శ్రీదేవి- బోనీకపూర్ ల ముద్దుల తనయ జాన్వీ కపూర్.. చుంకీ పాండే కుమార్తె అనన్యా పాండే ముందు వరుసలో ఉన్నారు. నటవారసురాళ్లలో కెరీర్ పరంగా తెలివైన ఎంపికలతో దూసుకెళుతూ కోట్లలో ఆర్జిస్తున్నారు.
ఇప్పటివరకూ ఈ భామలు సంపాదించిన నికర ఆదాయ విలువ లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇదంతా తండ్రులు ఇచ్చిన ఆస్తులు కావు.. కథానాయికలుగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించిన ఆదాయమే. సారా అలీఖాన్ ముంబై జుహూలో ఖరీదైన ప్లాట్ ని కల్గి ఉంది. దీని ధర కొటిన్నరకు పైగానే ఉంటుంది. వైట్ కలర్ హోండా సీవీఆర్ కార్ మెయింటెన్ చేస్తుంది. దీని ధర 30 లక్షలు ఉంటుంది. ఖరీదైన హ్యాండ్ బ్యాగులు ..యాక్సరీస్ వాడుతుంది. మొత్తంగా ఆమె సంపాదన 29 కోట్లకు పైగానే ఉంటుంది.
ఇక జాన్వీ కపూర్ నటిగా ఎంత బిజీగా ఉందో తెలిసిందే. ఒక్కో సినిమాకు నవతరం హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటోంది. సొంతంగా ఖరీదైన ప్లాట్.. కారు కల్గి ఉంది. మొత్తంగా 30 కోట్లకు పైగానే సొంత ఆదాయం కల్గి ఉంది. ఇక బోనీకపూర్-శ్రీదేవి ఆస్తులకు లెక్కే లేదు. అవేవీ జాన్వీ ముట్టుకోదు. అలాగే బాలీవుడ్ లోనే అగ్ర కథానాయికగా రాజ్యమేలుతున్న అలియా భట్ అత్యంత భారీ పారితోషికం అందుకునే అమ్మడిగా పాపులరైంది. ఇటీవల వరుస పాన్ ఇండియా ఆఫర్లతో అంతకంతకు పారితోషికం పెంచేసింది. ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలకు కలిపి 6 కోట్లు తీసుకుంది. వార్షిక ఆదాయం భారీగానే ఆర్జిస్తుందని సమాచారం. రెండేళ్ల క్రితమే బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే ఆదాయం భారీగానే ఉంది. ఇప్పటివరకూ 20 కోట్లకు పైగానే స్వీయ ఆర్జిత ఆస్తిని కలిగి ఉంది. `లైగర్` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు పూరి భారీగానే పారితోషికం ఇచ్చారని సమాచారం. మునుముందు కింగ్ ఖాన్ షారూక్ వారసురాలు .. సంజయ్ కపూర్ వారసురాలు సానయ... శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ వెండితెర ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ భామల ఆదాయ ఆర్జనపైనా ఆరాలు తీయాల్సి ఉంటుందేమో!