తెలుగు..హిందీలో రాని సమస్య తమిళంలో వచ్చింది

Update: 2019-11-27 11:59 GMT
టాలీవుడ్‌ సెన్షేషనల్‌ మూవీ అర్జున్‌ రెడ్డి హిందీలో కబీర్‌ సింగ్‌ గా డబ్‌ అయిన విషయం తెల్సిందే. తెలుగు మరియు హిందీలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ అయ్యాడు. ఇక కబీర్‌ సింగ్‌ సినిమా ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్‌ మూవీస్‌ సరసన చేరింది. హాట్‌ సీన్స్‌ విషయంలో ముద్దు సీన్స్‌ విషయంలో కాస్త రచ్చ జరిగినా సినిమాకు ఏ ఇతర సమస్యలు రాలేదు. కాని తమిళ వర్షన్‌ ఆధిత్య వర్మకు చాలా పెద్ద సమస్య వచ్చింది.

దాదాపు ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఇటీవలే విడుదలైన తమిళ అర్జున్‌ రెడ్డి 'ఆధిత్య వర్మ' తమిళ ఆడియన్స్‌ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ధృవ్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మంచి కలెక్షన్స్‌ కూడా వస్తున్న సమయంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా డాక్టర్ల సంఘం ఫిర్యాదుకు సిద్దం అయ్యింది. సినిమాలో డాక్టర్లను అవమానించినట్లుగా చూపించారంటూ డాక్టర్ల సంఘం తమిళనాడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.

డాక్టర్లపై ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగేలా ఈ సినిమా ఉందంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సినిమాలోని ఆ సీన్స్‌ ను తొలగించాలని.. లేదంటే సినిమా బ్యాన్‌ కోసం ఉద్యమం ఉదృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా నిర్మాతలు లేదా ఇతర టెక్నీషియన్స్‌ ఎవరు కూడా ఈ విషయంపై స్పందించలేదు. తెలుగు మరియు హిందీలో రాని డాక్టర్ల సమస్య తమిళంలో రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. మరి ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News