'లాక్ డౌన్'లో షూటింగ్ జరిపిన సినిమా ఇదొక్కటే!

Update: 2020-05-18 16:51 GMT
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశ ప్రజలంతా ఈ మహమ్మారి భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి నాలుగు గోడల బిక్కు బిక్కుమంటూ కొందరు.. దొరికిందే ఛాన్స్ అని ఫ్యామిలీతో హ్యాపీగా కాలక్షేపం చేస్తున్నారు మరికొందరు. ఇప్పటికే అన్నీ ప్రభుత్వాలు ప్రజలను భయటకు రావద్దని హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వ సూచనలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రమాదాన్ని పట్టించుకోకుండా మరిన్ని సమస్యలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ సినిమా యూనిట్‌ అలాంటి పనే చేసింది. ప్రభుత్వాల హెచ్చరిక వినకుండా తమ చిత్ర షూటింగ్‌ను కంటిన్యూ చేశారు. సమస్యలను కొని తెచ్చుకున్నారు. వారెవరో కాదు.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్ నటిస్తున్న 'ఆడుజీవితం' చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌ లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడి పరిస్థితి బాగోలేవని షూటింగ్ ఆపేయాలని అధికారులు చిత్రయూనిట్ కి గతంలోనే సూచించారు.

అయితే ఊహించని విధంగా.. అన్నీ టెస్టులు చేయించుకొని షూటింగ్ కొనసాగించారట ఈ టీమ్. ఇంకా ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఎడారి ప్రాంతం కావడంతోనే షూటింగ్ చేయడం సాధ్యమైందని తెలుస్తుంది. ఎందుకంటే ఒంటరి ప్రదేశంలో ఎడారిలో శిబిరాలు నిర్మించుకొని కంటిన్యూ చేశారట. ఇంకా కేవలం ఆ సినిమా చిత్రబృందం మాత్రమే ఉండటం.. చుట్టూ పక్కల ఎవరు లేకపోవడం వీరికి ప్లస్ అయింది. మొదట్లో ఇండియాకి రావడానికి ప్రయత్నించినా విమానయానం నిలిపేయడంతో షూటింగ్ అయినా పూర్తి చేద్దామని భావించారట. ఆడుజీవితం అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది మలయాళంలో మోస్ట్ అవైటింగ్ సినిమా. ఇక ఈ సినిమాకు బ్లేస్సి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే లాక్ డౌన్ లో కూడా షూటింగ్ కంటిన్యూ చేసిన ఇండియన్ సినిమా ఇదొక్కటే అని సమాచారం.
Tags:    

Similar News