జాతీయ స్థాయిలో `ఆహా` అనిపించేలా బిగ్ ప్లాన్

Update: 2021-08-23 05:34 GMT
మెగా నిర్మాత అల్లు అర‌వింద్ ఏ వ్యాపారం చేప‌ట్టినా అందులో ఎంతో ముందు చూపు ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌యోగాల‌కు వెర‌వ‌ని స్వ‌భావం ఆయ‌న‌ది. క‌రోనా స‌మ‌యంలో ఆహా-తెలుగు ఓటీటీని ప్రారంభించారు. టైమింగ్ అంటే ఇదీ అని నిరూపించారు. ఆరంభం భారీ స్థాయిలో కాకుండా కేవలం ఓ ట్ర‌య‌ల్ లా దీన్ని ప్రారంభించినా అంచ‌లంచెలుగా కంటెంట్ ని విస్త‌రిస్తూ రాజీ లేని ప‌నిత‌నం చూపిస్తున్నారు. కేవ‌లం తెలుగు కంటెంట్ ని మాత్ర‌మే అందించారు. సినిమాలు.. వెబ్ సిరీస్ లు..ఇత‌ర భాషల‌ అనువాద చిత్రాల్ని మాత్ర‌మే ఆహా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. అయిన‌ప్ప‌టీకి ఆహా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా రీచ్ అయింది. ఇత‌ర భాష‌ల్లో `ఆహా` సినిమాలు అందించిన‌ప్ప‌టీకీ బ్యాకెండ్ టీమ్ హార్డ్ వ‌ర్క్ తోనే త‌క్కువ కాలంలోనే ఎక్కువ‌గా రీచ్ అయింది. అయితే ఇప్పుడు `ఆహా`ని జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేందుకు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల ఒరిజిన‌ల్ కంటెంట్ తో అర‌వింద్ ప్లానింగ్ ఛేంజ్ అయ్యింది.

వ‌చ్చే రెండేళ్ల‌లో మెగా నిర్మాత ఆహా-ఓటీటీని ఓ రేంజ్ లో నిల‌బెట్టాల‌ని క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలిసింది. ముందుగా సౌత్ ఇండ‌స్ట్రీల‌న్నిటినీ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మిళం..మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల్లో ఆహా ఓటీటీ యాప్ డిజైన్ చేసి మార్కెట్లోకి వ‌ద‌లాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారుట‌. వాటిలో బెస్ట్ కంటెంట్ ని అందించి ఆహాని ఓ బ్రాండ్ గా మార్కెట్ లో నిల‌బెట్టాల‌ని  అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్న‌ట్లు  తెలిసింది. అనంత‌రం హిందీ స‌హా ఇత‌ర భాష‌ల్లోకి తీసుకెళ్లి జాతీయ స్థాయిలో ఆహా పేరు మార్మోగిపోయేలా చేయాల‌న్న‌ది ప్లాన్ అని తెలుస్తోంది.  మొత్తంగా ఇంత స‌క్సెస్ రావాలంటే నాలుగేళ్లు స‌మ‌యం ప‌డుతుంద‌ని..అప్ప‌టివ‌ర‌కూ క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని త‌న స్టాప్ కి అర‌వింద్ ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిసింది.

కొత్త‌గా ఓ పెద్ద ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు. ఇందులో ఇత‌ర భాష‌ల‌కు సంబంధించిన యాప్  వ‌ర్స్స్ స‌హా కంటెంట్ సెల‌క్ష‌న్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అలాగే స్టాప్ సంఖ్య‌ను కూడా భారీగా పెంచాల‌ని చూస్తున్నారుట‌. అందుకోసం  కోట్లాది రూపాయ‌ల్ని వెచ్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఏదేమైనా అర‌వింద్ ప్లానింగ్ చాలా ప‌క్కాగా ఉంటుంది.  అంతే కాన్పిడెంట్ గానూ ఎగ్జిక్యూట్ చేస్తారు. కాబ‌ట్టి భ‌విష్య‌త్ లో ఆహా.. నెట్ ప్లిక్స్.. అమెజాన్ ప్రైమ్.. డిస్నీ హాట్ స్టార్ లాంటి దిగ్గ‌జ ఓటీటీ యాప్ ల స‌ర‌స‌న చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది.
Tags:    

Similar News