తళా వర్సెస్ దళపతి ఫ్యాన్ వార్ గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. చాలా కాలంగా ఇరువురు హీరోల ఫ్యాన్స్ నడుమ ఘర్షణ బయటపడుతూనే ఉంది. సంక్రాంతి బరిలో జనవరి 11న అజిత్ కుమార్- దళపతి విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ అభిమానుల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందస్తు అంచనాల ప్రకారం తళా అజిత్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'తునివు' తమిళనాడులో దళపతి విజయ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'వారిసు' కంటే పెద్ద ఓపెనింగ్ సాధించింది. హెచ్.వినోద్ తెరకెక్కించిన 'తునివు' మాస్ ని భారీగా థియేటర్లకు రప్పించింది. తమిళనాడులో డే వన్ లో విజయ్ నటించిన వారిసు 19.5 కోట్లు వసూలు చేయగా.. తునివు 21.50 కోట్లు వసూలు చేసిందని చెన్నై మీడియాలో కథనాలొచ్చాయి.
తునివు తమిళనాడు అంతటా బంపర్ ఆక్యుపెన్సీని సాధించింది. ప్రారంభ రోజు విజేతగా నిలిచింది. తునివు గెలుపు కోసం మెరుగైన పంపిణీ వ్యూహం అనుసరించారని చెబుతున్నారు.
ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రంలో 85 శాతం డే వన్ లో ఫుల్ డే ఆక్యుపెన్సీని సాధించిందని బోనీ కపూర్- జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హీస్ట్ డ్రామాతో రక్తి కట్టించిందని సమీక్షించారు. ఈ మూవీకి తొలిరోజు అభిమానుల నుండి సానుకూల స్పందన దక్కింది. పండగ సీజన్ ని ఈ చిత్రం ఉపయోగించుకుని అజిత్ కుమార్ కి క్లీన్ హిట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
వారిసు వంటి భారీ ప్రాజెక్ట్ తో క్లాష్ అయినా 'తునివు'తో తళా అజిత్ తన కెరీర్ లో రెండవ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ను సాధించాడు. ఓపెనింగ్ ల పరంగా చూస్తే.. అజిత్ కుమార్ ఫిల్మోగ్రఫీలో 'వాలిమై' టాప్ లో నిలవగా ఇప్పుడు తునివు రెండో స్థానంలో నిలిచింది. 'తునివు' సోలోగా విడుదలై ఉంటే అది కేవలం అజిత్ కే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా రికార్డ్ ఓపెనర్ గా మారేదని కూడా ట్రేడ్ విశ్లేషించడం ఆసక్తికరం.
సోలో రిలీజ్ అయితే తునివుని తమిళనాడులో ఓపెనింగ్ డే రూ. రూ. 35 నుంచి 40 కోట్లు వసూలు చేసేదని అంచనా ఏర్పడింది. ఇప్పుడు సుమారు 20 కోట్లు దళపతి విజయ్ నటించిన 'వారిసు' షేర్ చేసుకుంది. వారిసు కంటే 5 శాతం అదనపు వసూళ్లతో తునివు ముందంజలో ఉంది.
దీనర్థం దళపతి విజయ్ రేసులో వెనకబడ్డారని కాదు. ఈ రెండు సినిమాలో నువ్వా నేనా? అంటూ పోటీపడుతూ వసూలు చేస్తున్నాయి. వారిసు చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. బంపర్ ఓపెనింగ్ లతో మొదలైన ఈ సినిమాలు రెండవ రోజు- మూడవ రోజు ఏ మేరకు వసూలు చేస్తాయో చూడాలన్న ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.