స్టార్ హీరో వైఫ్ సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ!

Update: 2022-11-30 00:31 GMT
సోష‌ల్ మీడియా అందుబాటులో ఉన్నా ఇంకా ఖాతాలు లేని సెల‌బ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఇన్ స్టా ..ఫేస్ బుక్...ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల‌కు అల‌వాటు ప‌డి ఆరోగ్యాలు పాడు చేసుకోవ‌డం దేనిక‌ని చాలా మంది సెల‌బ్రిటీలు వీటికి దూరంగా ఉంటున్నారు. కొంత మందికి ఖాతాలే లేక‌పోతే...మ‌రికొంత మంది ఉన్నా?  వాటి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం కొన్నాళ్ల పాటు వాటికి దూరంగా ఉండ‌టం జ‌రుగుతోంది.

అలాగే కొత్త‌గా వ‌చ్చే వాళ్లు వ‌స్తూనే ఉన్నారు. తాజాగా త‌ల అజిత్ స‌తీమ‌ణి శాలిని కూడా సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంత కాలం సోష‌ల్ మీడియాకి దూరంగా ఉన్న ఆమె ఇక‌పై యాక్టివ్ గా కొన‌సాగాలి అని  అకౌంట్లు ఓపెన్ చేసారు. ఒక‌ప్పుడు హీరోయిన్ గా రాణించిన శాలిని  అజిత్ ని వివాహం చేసుకున్న త‌ర్వాత మ్యాక‌ప్ కి దూర‌మ‌య్యారు.

అటుపై పూర్తిగా కుటుంబ జీవితానికే అంకిత‌మ‌య్యారు. శాలిని ఇల్లు దాటి బ‌య‌ట‌కు రారు. ఆమ‌ధ్య ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం కోసం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వ‌చ్చి  లైన్ లో నుంచుని ఓటు వేసి వెళ్లిపోయారు. మ‌ళ్లీ ఆమె ప్రేక్ష‌కుల‌కు క‌నిపిచింది లేదు. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు కాబ‌ట్టి ఇక‌పై ఆ ర‌క‌మైన స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో అప్ డేట్ ఇస్తూ అభిమానులు ఉత్సాహ ప‌ర‌చొచ్చు. అయితే శాలిని సోష‌ల్ మీడియా ఎంట్రీ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ క‌థ కూడా ఉంది. అజిత్ కి సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాలు షేర్ చేయ‌డం కోసమే ఆమె ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అజిత్ కి  బైక్ రైడ్ అంటే ఎంత ఇష్ట‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాళీ స‌మ‌యం దొరికితే బైక్ పై ప్ర‌పంచ యాత్ర చేసేస్తారు.

అలాంటి అప్డేట్స్ ని వీలైనంత వ‌ర‌కూ లైవ్ లో ఆమె స్వ‌యంగా  అందుబాటులో ఉంచాల‌ని  భావిస్తున్నారుట‌. ఆమె సోష‌ల్ మీడియా ఖాతా  తెర‌వ‌డం వెనుక అస‌లు కార‌ణం కూడా ఇదేన‌ని స‌మాచారం. మ‌రి వీటితో పాటు ఆమె వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా అభిమానుల‌కు షేర్ చేస్తారా?  లేదా? అన్న‌ది చూడాలి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News