అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ కు సడెన్ గా పవన్ కళ్యాణ్ విషయంలో ఓ డౌటొచ్చింది. పవన్ ఏదైనా సీక్రెట్ గా ఏదైనా మెడిసిన్ వాడతాడేమో తెలుసుకోవాలని ఉంది అంటున్నాడీ సిసింద్రీ. బయట చాలా కామ్ గా - రిజర్వ్డ్ గా.. సింపుల్ గా కనిపించే పవన్ కళ్యాణ్ తెర మీద మాత్రం అంత ఉత్సాహంగా - అల్లరి చిల్లరిగా - కొంటెగా ఎలా నటిస్తారో తనకర్థం కాదని అంటున్నాడు అఖిల్. దీని కోసం ఏదైనా మెడిసిన్ వాడతాడేమో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు అఖిల్.
ఇక మిగతా స్టార్ హీరోలు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు మీద తనకెంతో రెస్పెక్ట్ ఉందని.. ఐదేళ్ల తర్వాత మల్టీస్టారర్ చేయాల్సి వస్తే అది మహేష్ తోనే ఉండాలని కోరుకుంటానని చెప్పాడు అఖిల్. ఇప్పటికిప్పుడు మల్టీస్టారర్ అంటే తన ఛాయిస్ జూనియర్ ఎన్టీఆరే అని చెప్పాడు. అల్లు అర్జున్ తో ఏ రకమైన అసోసియేషన్ కోరుకుంటారు అని అడిగితే.. తన నిర్మాణంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు అఖిల్. హీరోయిన్లు ఒక్కొక్కరి గురించి ఒక్కో కామెంట్ చెప్పమంటే.. అనుష్క గార్జియస్ అని.. శ్రియ డ్రెస్ సెన్స్ అద్భుతమని.. సాయేషా సైగల్ (అఖిల్ ఫేమ్) చాలా క్యూట్ అని టకటకా సమాధానాలిచ్చాడు అక్కినేని యంగ్ ఛార్మ్.