దశాబ్ధాల పాటు స్టార్ హీరోగా బాలీవుడ్ లో సత్తా చాటుతున్న అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకి సుమారు 30 కోట్ల పారితోషికం దాంతో పాటే లాభాల్లో వాటాలు అందుకుంటున్నాడు. ప్రతియేటా నిజాయితీగా పన్ను చెల్లింపులు చేసే హీరోగాను అతడికి ఎంతో గౌరవం పేరు ఉన్నాయి. అయితే అక్షయ్ పై ఒక రూమర్ చాలా బలంగా ఉంది.
అక్షయ్ కుమార్ రూ. 260 కోట్ల ప్రైవేట్ జెట్ ను సొంతం చేసుకున్నాడని సకల సౌకర్యాల జెట్ లో అతడు నింగిలో విరవిహారంతో ఆస్వాధిస్తుంటాడని ప్రచారం ఉంది. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి నాలుగైదు సినిమాలను డెలివరీ చేస్తున్నందున అతడు ప్రయివేట్ జెట్ కొనుక్కునేందుకు అర్హుడన్న వాదన కూడా ఉంది.
అక్షయ్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. అదే క్రమంలో అతని అభిమానులలో ఒక వర్గం అతను ఎంత సంపాదిస్తాడో అని ఆరాలు తీస్తూ లెక్కలను సోషల్ మీడియాల్లో చూపించడం మొదలు పెట్టారు. ఖిలాడీ కుమార్ దగ్గర ఖరీదైన వస్తువులు ఏం ఉన్నాయో పరిశీలిస్తే దానిపై ప్రశ్నిస్తే.. అతను ప్రశాంతతను కోల్పోయాడు. దాదాపు రూ. 260 కోట్ల ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారనే వార్తలను ఆయన ఖండించారు. నిరాధారమైన వార్తలని అన్నారు.
ఇటీవల బాలీవుడ్ లైఫ్ ప్రచురించిన ఓ కథనంలో అక్షయ్ కుమార్ రూ.260 విలువైన ప్రైవేట్ జెట్ ను కలిగి ఉన్నారని పేర్కొంది. దీనిపై స్పందించిన అక్షయ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో స్పందించాడు. ఆ కథనం తాలూకా స్క్రీన్ షాట్ ను షేర్ చేసి సదరు వెబ్ ని తిట్టాడు. ``అబద్ధాలకోరు... అబద్ధాలకోరు...ప్యాంట్ లో మంటలు...! ఇది మీ చిన్నతనంలో విన్నారా?`` అంటూ రుసరుసలాడాడు.
కొంతమంది స్పష్టంగా ఎదగలేదు అంటూ వెబ్ నిర్వాహకులపై అక్షయ్ విరుచుకుపడ్డారు. నేను వారిని తప్పించుకునే మానసిక స్థితిలో లేను. నా గురించి నిరాధారమైన అబద్ధాలు రాయండి. నేను దానిని ఏమని పిలుస్తాను అంటే... మీ కోసం ప్యాంట్ ఆన్ ఫైర్ (POF)..! అంటూ పంచ్ వేసాడు. చాలా మంది అభిమానులు కిలాడీ ఇలా ప్రతిస్పందించినందుకు ప్రశంసించారు. చాలా కాలం తర్వాత మీ దూకుడును ఎదురెళ్లే మానసిక స్థితిని చూడటం ఆనందంగా ఉంది అని ఒక నెటిజనుడు ప్రశంసించాడు. మరొకరు అతన్ని `రాజు` అని పొగిడేసారు. అభిమానుల్లో ఒక వర్గం అతని తదుపరి చిత్రం రామ్ సేతు విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపింది.
అక్షయ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే... 55 ఏళ్ల నటుడు తదుపరి రామ్ సేతులో కనిపించనున్నారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్- నుష్రత్ భరుచ్చా - సత్య దేవ్ కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలిచే `రామసేతు` స్వభావాన్ని పరిశోధించే పురావస్తు శాస్త్రవేత్త గా అక్కీ నటించారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి తర్వాత అక్టోబర్ 25న విడుదల కానుంది.