బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ తన అభిమానులను ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. చంద్రప్రకాష్ ద్వివేది రచించి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. యష్ రాజ్ బ్యానర్ లో ఇది ఊహించని ఫలితమని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. 3 జూన్ 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజు 12.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో మొత్తం రూ. 23.30 కోట్లు వసూలు చేసింది. బడ్జెట్‌తో పోలిస్తే కలెక్షన్లు చాలా పేలవంగా ఉన్నాయి. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా కనీసం 50కోట్లు అయినా వసూలు చేయలేని సన్నివేశంలో ఉంది.
సామ్రాట్ పృథ్వీరాజ్ లో మానుషి చిల్లర్- సోనూ సూద్- సంజయ్ దత్- అశుతోష్ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ దాదాపు 150కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ చిత్రానికి సంచిత్ బల్హారా- అంకిత్ బల్హారా- శంకర్-ఎహసాన్-లాయ్ సంగీత దర్శకులుగా పని చేసారు. ఇంతమంది దిగ్గజాలు పని చేసినా కానీ ఫలితం ఊహించని విధంగా రావడాన్ని అక్కీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజానికి హిస్టారికల్ కాన్సెప్ట్ తో రూపొందించే సినిమాల విషయంలో బాహుబలి 2 ఒక గీటురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రభాస్- రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజే 100కోట్లు పైగా వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లో 300కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించడమే గాక రోజులు గడిచే కొద్దీ వసూళ్లను పెంచుకుంటూ రికార్డులు తిరగరాసింది.
చారిత్రక కథాంశాలను ఎంచుకుంటే కచ్ఛితంగా ట్రేడ్ లో ప్రజల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ వాటిని అందుకోవడంలో తడబడితే విమర్శలు అంతే తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు యష్ రాజ్ బ్యానర్ .. అక్షయ్ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మరో బాహుబలి అవుతుందనుకుంటే..ఇలా అయ్యింది! అంటూ కథనాలు వండి వారుస్తున్నారు. ఇక హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించిన ఈ మూవీలో అక్షయ్ పాత్రపైనా కొన్ని విమర్శలు చుట్టుముట్టాయి. ఇందులో నటించిన సోనూసూద్ పాత్రకు గొప్ప పేరొచ్చింది. క్రూరుడైన మొఘల్ రాజు మహమ్మద్ ఘోరీని ఎదురించి పోరాడిన ధీరుడైన భారతీయ చక్రవర్తిగా పృథ్వీరాజ్ గురించి సోషల్ పాఠాలు చదువుకున్న యూత్ సినిమా తీస్తున్నారు అనగానే ఎంతో ఊహించుకున్నారు. కానీ తెరపై ఆశించినది దక్కలేదు.