ఇప్పుడు దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద అవలీలగా వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు మాత్రం మినిమమ్ ఓపెనింగ్స్ సాధించడానికి కష్టపడాల్సి వస్తోంది.
బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. గత కొంతకాలంగా థియేటర్లలోకి వచ్చిన సినిమాల ఫలితాలను, బాక్సాఫీస్ లెక్కలు గమనిస్తే హిందీ సినిమాల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
ఇటీవల వచ్చిన 'భూల్ బులైయా-2' సినిమా మంచి వసూళ్ళు సాధించడంతో.. బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుందని అందరూ భావించారు. అయితే అదే వీక్ లో రిలీజైన కంగనా రనౌత్ 'ధాకడ్' మూవీ కనీస ఓపెనింగ్స్ లేక భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా కూడా నిరాశ పరచడంతో.. బాలీవుడ్ బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతుందని అర్థం అవుతుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫస్ట్ వీకెండ్ లో కూడా ఆశించిన స్థాయిలో వసూళ్ళు అందుకోలేకపోయింది.
అదే రోజు థియేటర్లలోకి వచ్చిన 'మేజర్' & 'విక్రమ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంటే.. 'పృథ్వీరాజ్' కు కనీస ప్రేక్షకాదరణ దక్కలేదు. మొదటి వారాంతంలో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టినప్పటికీ.. వీక్ డేస్ లో మాత్రం భారీగా డ్రాప్స్ చవిచూసింది.
ఇక ఐదో రోజు థియేటర్లలో జనాలు లేకపోవడంతో చాలా చోట్ల 'పృథ్వీరాజ్' షోలు క్యాన్సిల్ అయ్యాయి. 'భూల్ బులయ్యా 2' సినిమా రెండో వారంలోను స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ సినిమాఐదు రోజుల్లో ₹ 52.25 కోట్లు మాత్రమే రాబట్టి బాలీవుడ్ లో మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది.
పృథ్వీరాజ్ చిత్రానికి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. బ్యానర్ పేరుకు తగ్గట్టుగానే గట్టిగా ప్రమోషన్స్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా లభించింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో బాలీవుడ్ ఖాతాలో మరో భారీ ప్లాప్ వచ్చి చేరింది.
ఇటీవల కాలంలో '83' 'గంగుబాయి' 'ఎటాక్ 1' 'బచ్చన్ పాండే' 'జెర్సీ' 'రన్ వే 34' 'హీరోపంతి 2' 'జయేష్ భాయ్ జోర్దార్' 'ధాకడ్' వంటి హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. మరోవైపు 'పుష్ప' 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీఎఫ్-2' వంటి సౌత్ సినిమాలు నార్త్ లో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మించిన 'ది కశ్మీర్ ఫైల్స్' మరియు 'భూల్ బులయ్యా 2' సినిమాలు మాత్రమే కరోనా పాండమిక్ తర్వాత హిందీలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరి రానున్న రోజుల్లోనైనా బాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే సినిమాలు వస్తాయేమో చూడాలి.